Aadi Next Nuvve Trailer Released | నెక్ట్స్ నువ్వే మూవీ ట్రైలర్ రిలీజ్.. కొత్తేముంది? ఆదికి లక్ కలిసొస్తుందా?

Aadi new movie trailer released

Aadi Sai Kumar, Next Nuvve Movie, Trailer Release, Next Nuvve Movie Director, Next Nuvve Movie Trailer, Next Nuvve Actress, Aadi Next Nuvve Trailer Review, Next Nuvve Comedy Horror Thiller

Aadi Sai Kumar Next Nuvve Movie Trailer Released.

ఆది నెక్స్ట్ నువ్వే ట్రైలర్ రిలీజ్

Posted: 09/18/2017 03:20 PM IST
Aadi new movie trailer released

హిట్ లేకుండా పోయిన హీరోల్లో ఆది సాయికుమార్ కూడా ఒకడు. వరుస చిత్రాలు బోల్తా పడుతుండటంతో ఈసారి హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే నెక్ట్స్ నువ్వే. బుల్లితెర ప్రభాకర్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ఇది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఆది సాయికుమార్ .. వైభవి జంటగా నటించిన ఈ సినిమాలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు. కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ తో మొత్తం సినిమా ట్రైలర్ సాగిపోయింది.

 

యాంకర్ రష్మీ నోటి నుంచి ఓ డబుల్ మీనింగ్ డైలాగును కూడా పలికించారు. నలుగురు డిఫరెంట్ వర్గాలకు చెందిన మనుషులు ఓ హోటల్ పెట్టేందుకు బూతు బంగ్లాకు వెళ్తారు. అక్కడ ఒక్కోక్కరుగా ప్రాణాలు కోల్పోతుంటారు. చివరకు హీరో ఆది వంతు వస్తుంది. అప్పుడు ఆది ఏం చేస్తాడు? అన్నదే కథ. అవసరాల శ్రీనివాస్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించినట్లు అర్థమౌతోంది. నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles