Social Media Trend with Jimikki Kammal Song | ఈ జిమ్మిక్కి కమల్ కథేంటో తెలుసా?

Jimikki kammal song story

Jimikki Kammal Song, Mohanlal song Social Media, Jimikki Kammal Song Mohanlal Movie, Jimikki Kammal Song Movie, Jimikki Kammal Video Song, Jimikki Kammal Song Suma, Jimikki Kammal Song All Versions

Jimikki Kammal Song Trend in Social Media. Jimikki Kammal video song from Velipadinte Pusthakam, Mohanlal starrer. Now every where this song viral.

జిమ్మిక్కి కమ్మల్.. ఏంటా కథ?

Posted: 09/16/2017 06:15 PM IST
Jimikki kammal song story

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జిమ్మిక్కి కమ్మల్ తో ఊగిపోతుంది. మొన్నామధ్య ఓనం పండుగ స్పెష‌ల్ గా కేర‌ళ లోని కొచ్చిలో ఉన్న‌ ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ కామ‌ర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన 'జిమిక్కి క‌మ్మ‌ల్' డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ మూలంగానే ఇదంతా. ఆగ‌స్టు 30 న రిలీజ‌యిన ఈ వీడియో సాంగ్ ను ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రెండు కోట్ల దాకా యూట్యూబ్ లో వీక్షించారు.

ఇక ఇదే సాంగ్ ను మన యాంకర్ సుమ కూడా మొన్నీ మధ్యే స్టెప్పులేసీ వీడియో తీసి అప్ లోడ్ చేయగా, అది అప్ లోడ్ అయ్యింది. ఇప్పుడు కార్టూన్ పార్ట్ మినియన్లు కూడా జిమ్మిక్కి కమ్మల్ కు వేసిన స్టెప్పులు ఊపు ఊపేస్తున్నాయి. `జిమ్మిక్కి క‌మ్మ‌ల్ మినియ‌న్ వెర్ష‌న్‌` అనే పేరుతో ఉన్న ఈ వీడియోలో పొట్టి పొట్టి మినియ‌న్లు, ముద్దులొలికే స్టెప్పుల వేయ‌డం చూడొచ్చు. నిజానికి ఇది వేరే పాటకు వేసిన డ్యాన్స్ అయినా `జిమ్మిక్కి క‌మ్మ‌ల్` బీట్ల‌కు క‌రెక్టుగా స‌రిపోయేలా సింక్ చేశారు.

ఇంతకీ ఈ పాట ఎక్కడిదంటే మళయాళ సీనియర్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహ‌న్ లాల్ న‌టించిన‌ '`వెలిపాడిందే పుస్త‌గం` సినిమాలోనిది. ఓ కాలేజీలో స్టూడెంట్లు సరదాగా పాడే ఈ సాంగ్ ఉంటుంది. చివర్లో లెక్చరర్ గా మోహన్ లాల్ ఎంట్రీ కూడా చూడొచ్చు. కేర‌ళ, త‌మిళ‌నాడు, ముంబై న‌గ‌రాల‌తో న్యూయార్క్‌లో ఉంటున్న భార‌తీయులు ఈ పాట‌కు స్టెప్పులు వేసి, వీడియోల‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles