Sanjay Dutt Admits Afafir with Heroines | ఇద్దరు కాదు.. ముగ్గురితో ఒకేసారి అఫైర్ నడిపా...

Sanjay dutt confess affairs with heroines

Sanjay Dutt, India Today Mind Rocks 2017, Sanjay Dutt Shares Affairs, Sanjay Dutt Open Up about Affairs, Sanjay Dutt Speech at India Today Event

Sanjay Dutt Confess that he maintain affair with 3 heroines simultaneously. Sanjay also shared on drugs and jail-time at India Today's Mind Rocks 2017.

ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్లతో అఫైర్ నడిపా: సంజయ్ దత్

Posted: 09/16/2017 04:23 PM IST
Sanjay dutt confess affairs with heroines

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ మధ్య బాగా ఓపెన్ అయిపోతున్నాడు. జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న సంజయ్ దత్ గతంలో బాలీవుడ్ హీరోయిన్లతో ఉన్న అఫైర్ల గురించి చెప్పేశాడు.

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2017 ఈవెంట్ కు సంజయ్ దత్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన పలువురు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చాడు. అప్పట్లో ఇద్దరు హీరోయిన్లతో అఫైర్ నడిపారంట కదా? అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఊహించని షాకే ఇచ్చాడు.

ఇద్దరు కాదు ముగ్గురితో నడిపాను. అది కూడా ఒకేసారి. మెయింటెన్ చేసే తెలివి ఉంటే ఒకేసారి పది మందితో కూడా అఫైర్ నడపొచ్చు అంటూ సంజూ ఆన్సర్ ఇచ్చాడు. తనకలా ఫ్లే బాయ్ ఇమేజ్ రావటం చాలా నచ్చేదని.. తన అభిమానుల్లో మహిళలు కూడా ఉండటం సంతోషాన్ని ఇచ్చిందని సంజూ పేర్కొన్నాడు. అయితే జైలు జీవితం తర్వాత ఆ అభిమానులు అలాగే ఉన్నారో లేక మారిపోయారో అన్న విషయం మాత్రం తెలీదంటూ చమత్కారంగా మాట్లాడాడు. దీంతోపాటు కాలేజీ రోజుల్లో తాను డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని కూడా అంతే మొహమాటంగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సంజయ్ దత్ నటించిన భూమి చిత్రం రిలీజ్ కు రెడీ అయిపోయింది. హైదరాబాద్ అమ్మాయి అతిథి హైదరీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాటం సాగించే తండ్రి రోల్ లో సంజయ్ నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles