పవన్ ట్విట్టర్.. కాస్త లేట్ అయ్యిందంతే... | Pawan Kalyan Twitter Touched 2 Million Followers.

Pawan twitter new record

Pawan kalyan, Pawan Twitter, Pawan kalyan Twitter 2 Million Club, Pawan kalyan Twitter Record, Pawan Kalyan Twitter Club

Pawan Kalyan Twitter joined in Two Million Club. Power Star Fans Happy with that Achievement.

పవన్ ట్విట్టర్.. 2 మిలియన్ ఫాలోవర్లు

Posted: 09/12/2017 03:48 PM IST
Pawan twitter new record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ మరో కొత్త రికార్డు సాధించింది. నేటితో ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్లు అంటే 20,00,000 ఫాలోవర్లకు చేరుకుంది. జనసేన పార్టీని పెట్టిన తరువాత తన అభిప్రాయాలను పంచుకోవడానికి సినీనటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి... పవన్ ను మించిపోయాడా?

ప్రజా సమస్యలపై వివిధ సందర్భాలలో ప్రభుత్వాలపై విమర్శలు.. ఎవరికైనా శుభాకాంక్షలు తెలియజేయాలన్నా... ప్రజలకు పిలుపునివ్వాల‌న్నా ట్విట్ట‌ర్‌నే ఉప‌యోగించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో చాలా సార్లు తప్పులు దొర్లిన విషయం కూడా తెలిసిందే. ఆయా సందర్భాలలో ప్రత్యర్థులు ట్రోల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా బహిరంగంగా మాట్లాడకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ కేవలం ట్విట్ట‌ర్ ద్వారా మాత్ర‌మే స్పందిస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారూ లేక‌పోలేరు.

ఇక ఆ విషయాలను పక్కన పెడితే 2 మిలియన్ల క్లబ్ లో చేరిన సెలబ్రిటీగా పవన్ ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించారు. దీనిపై నిర్మాత బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయటం విశేషం. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న ప‌వ‌న్.. మరోవైపు జనసేన పార్టీ ద్వారా 2019 ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles