Venkatesh Naga Chaitanya Multi Starrer Almost Confirmed.

Venky chaitu multi starrer almost confirmed

Venkatesh, Akkineni Naga Chaitanya, Multi-Starrer Movie, Kalyan Krishna

Akkineni Naga Chaitanya will team up with his maternal uncle and star actor Victory Venkatesh for a multi-starrer to be helmed by Soggade Chinni Nayana director Kalyan Krishna.But, not yet Confirmed Official.

వెంకీ-చైతూ మల్టీస్టారర్.. కన్ఫర్మ్?

Posted: 09/08/2017 06:36 PM IST
Venky chaitu multi starrer almost confirmed

తెలుగులో మరో మల్టీ స్టారర్ మూవీ సందడి చేయబోతుంది. ఆ జోనర్ చిత్రాలకు ఎప్పుడూ ముందుండే విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపు ఖరారైందనే సమాచారం.

సోగ్గాడే చిన్నినాయనా, రా.. రండోయ్ వేడుక చూద్దాం... చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వెంకీతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలని ఫ్లాన్ చేశాడు. ఇందుకోసం ఓ యంగ్ హీరోను ముందుగా మరో పాత్రకు అనుకున్నాడు కూడా. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆ ప్లేస్ లో ఇప్పుడు చైతూ వచ్చి చేరాడు. అయితే వెంకీ రికమండ్ చేయటంతోనే చైతూకి ఫ్లేస్ దక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కినేని హీరోలకు మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో మరో మూవీ చేయటానికి చై కూడా అభ్యంతరం చెప్పలేదనే సమాచారం.

ఇక మరో వార్త ఏంటంటే... ఇది ఓ క్లాసిక్ చిత్రానికి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం స్టోరీ కాకపోయినా కాన్సెప్ట్ తీసుకుని నేటి ట్రెండ్ కు అనుగుణంగా మార్చి కళ్యాణ్ కొత్త స్క్రిప్ట్ రాయబోతున్నాడంట. పూర్తి తారాగణం వివరాలతో త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్సుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles