NTR Kusa Character Teaser Released

Kusa teaser released

NTR, Jai Lava Kusa, New Teaser, Kusa Teaser, Kusa Yama Donga, Director Bobby

NTR's Jai Lava Kusa Another Teaser Released. Kusa Character Not Impress as Much Jai Teaser.

కుశ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే...

Posted: 09/08/2017 04:24 PM IST
Kusa teaser released

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదలకి ముస్తాబవుతోంది. ఎల్లుండి అంటే సెప్టెంబర్ 10న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విలక్షణమైన పాత్రలను పోషించాడు.

ఆల్రెడీ 'జై' .. 'లవ' పాత్రలకి సంబంధించిన ఫస్టులుక్ లు .. టీజర్లు రిలీజ్ చేశారు. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా 'కుశ' ఫస్టులుక్ వదిలిన ఈ సినిమా టీమ్, కొంతసేపటి క్రితం 'కుశ' పాత్రకి సంబంధించిన టీజర్ ను వదిలింది. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. జై .. లవ .. పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ పాత్ర కనిపిస్తూ ఉండటం విశేషం.

 

 

'కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేదిలా వుంది. మొదటి రెండు టీజర్ల మాదిరిగానే ఈ టీజర్ కూడా అభిమానుల్లో ఆనందాన్ని .. అందరిలో అంచనాలను పెంచేదిలా ఉందని చెప్పొచ్చు. అయితే యమదొంగ టీజర్ లా ఉందంటూ కాసింత కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles