Priyanka lauds UNICEF for a game to help adolescents.

Priyanka explains about nugget

Priyanka Chopra, UNICEF, UNICEF Global Goodwill Ambassador, Nugget Game, Campaigning, Priyanka Video Game

Priyanka Chopra has lauded UNICEF India for making a stress-free mobile game Nugget to help adolescents to beat "stressors" in life.Priyanka, who is the UNICEF Global Goodwill Ambassador, on Sunday took to Twitter, where she shared a minute-long video.

ప్రెషర్ లో ప్రియాంక నగ్గెట్ ను ఆశ్రయిస్తుందంట!

Posted: 09/06/2017 03:28 PM IST
Priyanka explains about nugget

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఓ ఆటను ప్రచారం చేసే పనిలో బిజీగా ఉంది. నగ్గెట్ అని పిలిచే ఆ ఆట లేని మొబైల్ అసలు మొటైలే కాదని కూడా అంటోంది. ఇంతకీ ఆ ఆటలో అంతగా ఏముందంటారా? తీవ్ర ఒత్తిడితో ఉన్న నేటి యువతకు ఈ ఆట ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది.

ప్రస్తుతం బ్లూ వేల్ ఛాలెంజ్ మూలంగా యువత ప్రాణాలు తీసుకుంటోంది. డేంజరస్ గేమ్ అని చెబుతున్నప్పటికీ ఆడుతూనే దానికి బానిసలుగా మారిపోయి. ఆపై ఆటకే బలైపోతున్నారు. అందుకే వాటిని అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ ఈ కొత్త ఆటను రూపకల్పన చేసింది. ఇక యునిసెఫ్ కు అంత‌ర్జాతీయ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా, ఇండియాలో ఈ వీడియోగేమ్ గురించి విప‌రీతంగా ప్ర‌చారం చేస్తోంది.

వివిధ ప‌నుల కార‌ణంగా ఒత్తిడి బారిన ప‌డుతున్న యువ‌త‌కు ఈ గేమ్ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌ని, తాను కూడా ఈ ఆట‌ను ఆడు‌తున్నాన‌ని ప్రియాంక‌ పేర్కొంది. అయితే ప్రియాంక ప్రచారం ప్రారంభించిన కొద్దిసేప‌ట్లోనే ఈ గేమ్ డౌన్‌లోడ్ల సంఖ్య పెరిగింది. దీంతో వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ప్రియాంక తన ట్వి్ట్టర్ లో మ‌రో పోస్ట్ పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles