బాహుబలితో ప్రభాస్ కు ఇప్పుడు ఎలాగైతే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందో.. సుమారు 11 ఏళ్ల క్రితమే మహేష్ అలాంటి ఛాన్స్ ను మిస్ చేసేసుకున్నాడు. పొకిరితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ టాప్ చెయిర్ కు రీచ్ అయిన సమయంలో వరుస ఫ్లాపులతో రేసులో వెనక్కి వెళ్లిపోయాడు. అయినప్పటికీ నేషనల్ వైడ్ గా మోస్ట్ డిసైరబుల్ జాబితాలో ఇప్పటికీ మహేష్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
అయితే ఆ క్రేజ్ ను మళ్లీ పెంచేసుకునే ఛాన్స్ మురగదాస్ స్పైడర్ రూపంలో దక్కినట్లయ్యింది. ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో ఫ్లాన్ చేశాడు. బాహుబలి తర్వాత ఇప్పుడు వస్తున్న ప్రతీ బిగ్ మూవీస్ ను దాంతోనే కంపేర్ చేయటం మొదలుపెట్టేయటం చూస్తున్నాం. అందుకే విజువల్ ఎఫెక్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానీ క్రేజ్ డైరక్టర్ కావాలనే ఆలస్యం చేశాడన్న ఓ రీజన్ ఉంది.
ఇదే సమయంలో సినిమాను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఫ్లాన్ లో మేకర్లు ఉన్నారు. ఇందుకోసం బాహుబలి మాదిరిగానే ఇంటర్నేషనల్ ప్రమోషన్ ఈవెంట్లు సిద్ధం చేసున్నారంట. లండన్, ప్యారిస్, కెనెడా, బీజింగ్, మాస్కో, సౌదీ ఇలా దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో స్పైడర్ సందడి మొదలుకాబోతుంది. వీటికి మహేష్ హాజరుకాకపోయినా.. కొచ్చి, చెన్నై, ముంబై ఈవెంట్లలో మాత్రం ప్రిన్స్ హజరవుతాడని సమాచారం. మరోవైపు తెలుగుతోపాటు కోలీవుడ్; హిందీలో కూడా నంబర్ ఆఫ్ స్క్రీన్లలోనే స్పైడర్ బొమ్మ పడేలా ఫ్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27 ఈ స్పై యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. యంగ్ హీరోలు వరుస హిట్లతో టఫ్ కాంపిటీషన్ ఇస్తుండటంతో తమ సినిమాలను జస్ట్ హిట్లు అనిపించుకుంటే మాత్రం కుదరదు కదా.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more