మాస్ రాజా మొహం ఎందుకు మాడింది, డ్రైవర్ ను ఇరికిస్తున్నారా? | Ravi Teja Driver Really Supply Drugs in Tollywood

Ravi teja driver attend before sit

Ravi Teja Driver Srinivasarao, Srinivasa Rao SIT, Ravi Teja Driver Drug Case, Ravi Teja Driver Drug Supplier, Ravi Teja Reveal SIT Probe

After Actor Ravi Teja Grilled For 10 Hours In Hyderabad Drug Case Now his Driver Turn Comes. Ravi Teja Driver Srinivasarao Attended before SIT. SIT to Interrogate Ravi Teja Driver Srinivasa Rao Today

సిట్ ముందుకు శ్రీనివాసరావు.. కీలక వ్యక్తి?

Posted: 07/29/2017 09:33 AM IST
Ravi teja driver attend before sit

సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాలో రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాసరావుదే కీలక పాత్ర అని భావిస్తున్న అధికారులు అతన్ని ఇవాళ విచారించనున్నారు. శుక్రవారం రవితేజ విచారణ సందర్భంగా ఆయన వెంట శ్రీనివాసరావు సిట్ కార్యాలయానికి వచ్చాడు. మీడియాలో అతన్ని ప్రముఖంగా కూడా చూపిన విషయం తెలిసిందే. కెల్విన్ నుంచి సినీ ప్రముఖులకు మధ్య శ్రీనివాసరావే సప్లయిర్ గా ఉన్నాడని సిట్ బలంగా నమ్ముతోంది. దీంతో అతడిని ప్రశ్నించడం ద్వారా వివరాలు సేకరించాలని నిర్ణయించారు.

ఇక నిన్న జరిగిన విచారణలో రవితేజ తనకు, డ్రగ్స్‌కు ఎటువంటి సంబంధం లేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని పేర్కొన్నాడు. తాను బ్యాంకాక్ వెళ్లేది మంచి ఆలోచనల కోసమే తప్ప డ్రగ్స్ తీసుకునేందుకు కాదని స్పష్టం చేశాడు. అయితే చిన్నచిన్న పార్టీలు సహజమేనని అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు సాగిన సిట్ విచారణలో రవితేజ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చేప్పుడు ఎంత సరదాగా కనిపించాడో.. వెళ్లేప్పుడు అంత సీరియస్ గా అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయాడు. 

తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కానీ, ఇతర చెడు అలవాట్లు కానీ లేవని తేల్చి చెప్పాడు. డ్రగ్స్ కేసులో నిందితులైన జీషన్, కెల్విన్‌‌ల ఫోన్ కాల్ డేటాలో మీ ఫోన్ నంబరు ఎందుకు ఉందన్న ప్రశ్నకు.. వారెవరో తనకు తెలియదని, వారి కాల్ లిస్ట్‌లో తన నంబరు ఉండడం తప్పెలా అవుతుందని అధికారులను తిరిగి ప్రశ్నించాడు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని పేర్కొన్నాడు. తన సోదరుడు భరత్‌కు డ్రగ్స్ అలవాటుపై అధికారులు వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. భరత్‌కు గంజాయి తాగే అలవాటు ఉండొచ్చేమో కానీ కొకైన్ వంటి మత్తు పదార్థాల జోలికి ఎప్పుడూ పోలేదని పేర్కొన్నాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మి, ముమైత్‌ఖాన్‌లకు డ్రగ్స్ అలవాటుందా? అన్న ప్రశ్నకు లేదని ముక్తసరిగా జవాబు చెప్పాడు. విచారణ అనంతరం పరీక్షల కోసం గోళ్లు, జుట్టు, రక్త నమూనాలు తీసుకోవచ్చా? అని అడగ్గా ఇచ్చేందుకు రవితేజ నిరాకరించాడు.

మరోవైపు రవితేజ డ్రైవర్ ను సంబంధం లేకపోయినా అనవసరంగా ఇరికించి వాళ్లంతా సైడ్ అయిపోతున్నారన్న మరోవాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Driver Srinivasa Rao  SIT Probe  

Other Articles