బాలీవుడ్ నటి కమ్ సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయించింది. రేప్ చేస్తామంటూ అసభ్యపదజాలంతో ఆమెను కొందరు బెదిరించటంతో బుధవారం ఆమె ఫిర్యాదు చేసింది. ముస్లింలు చేసుకునే 'ఆజాన్' గురించి కామెంట్ చేసిన అనంతరం ఈ పాపులర్ సింగర్ కు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి.
దేవుడు ఉన్నాడంటూ పెద్ద పెద్ద మైక్ లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదంటు ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారమే రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా కూడా ఆమె పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ లో అభినందనలతోపాటు తిట్ట పురాణం కూడా వచ్చి చేరుతోంది. ఆమెను లైంగికంగా కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంట. ఈ నేపథ్యంలో సుచిత్ర ఓషీవర పోలీసులను ఆశ్రయించింది. దీంతో నలుగురు నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Look at these perverts! Feel sorry for my India -with this kind of attitude towards women its no wonder we've become rape capital of d world pic.twitter.com/Hteg0IXRM8
— Suchitra (@suchitrak) July 25, 2017
'ఈ వికృతమైన వ్యక్తులను చూడండి. నా దేశాన్ని చూస్తుంటేనే జాలి వేస్తోంది. మహిళల పట్ల ఇంత దారుణమైన దృక్పథం ఉన్నప్పుడు... ప్రపంచ రేప్ రాజధానిగా మన దేశం ఉండటంలో ఆశ్చర్యం లేదు' అంటూ వ్యాఖ్యానిస్తూ వాళ్లు చేసిన కామెంట్లను స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది. తాను బ్రహ్మ ముహుర్తంలోనే లేచి అన్ని పనులు చేసుకుంటానని, చెవులు చిల్లులు పడేలా పిలుపు ఇవ్వటం అవసరం లేదని ట్వీట్ చేసిన సుచిత్ర, తీవ్రవిమర్శలు రావటంతో తాను ఆజాన్ కు గౌరవమిస్తానంటూ పేర్కొనటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more