NTR Rectify that Mistake for Bigg Boss Show

Ntr writer eliminated from bigg boss show

NTR, NTR Bigg Boss, NTR Bigg Boss Dialogues, NTR Bigg Boss Writer, NTR Eliminate Writer, NTR Natural Dialogues, NTR Free Hand Bigg Boss, Telugu Bigg Boss Minuses, NTR Bigg Boss Big Minus

NTR's Dialogues in Bigg Boss sounded artificial. NTR Decided that the writer will now provide the basic information and ideas to approach the scene, it is Jr NTR who will decide what he will speak, what punches he will throw and how he's going to address the contestants.

బిగ్ బాస్ షో.. రైటర్ ను లేపేశారా?

Posted: 07/27/2017 11:15 AM IST
Ntr writer eliminated from bigg boss show

తెలుగులో అద్భుతాలు చేస్తుందనుకున్న బిగ్ బాస్ షో కూడా చప్పగానే సాగుతోంది. అయితే కేవలం వీకెండ్ లలో మాత్రం షో టీఆర్పీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ఎన్టీఆర్ అందిస్తున్న హోస్టింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ మ్యాజిక్ వరకు బాగానే ఉన్నప్పటికీ షో కి రావాల్సిన సహజత్వం మాత్రం ఎందుకనో మిస్సవుతూ వస్తోంది. అందుకు కారణం ఎన్టీఆర్ పలికే డైలాగులే...

నిజానికి ఈ షో కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ డైలాగ్ రైటర్ ను అపాయింట్ చేశారు. హౌజ్ లో అప్పటిదాకా జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని అతగాడు సంభాషణలు రాస్తుంటాడు. అంటే ఎవరో రాసిన డైలాగులను ఎన్టీఆర్ వాటినే తెరపై పలికించేస్తున్నాడన్న మాట. సహజంగా ఇలాంటి షోలకు అప్పటికప్పుడు చెప్పే డైలాగులు అయితేనే బావుంటాయి. అందుకే బేస్డ్ టోన్ ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ డైలాగులు జనాల్లో అంత బలమైన ముద్ర వేయలేకపోతున్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాడని, అందుకే నిర్వాహకులకు నచ్చజెప్పి ఓ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.

రైటర్ ను కేవలం హౌజ్ లో జరిగే విషయాలను వివరించేందుకు మాత్రమే పరిమితం చేసి, తన వరకు డైలాగులను సొంతంగా ఆన్ ది స్పాట్ లోనే చెప్పాలని డిసైడ్ అయ్యాడంట. తద్వారా సౌకర్యంగా ఉండటమే కాదు.. జనాల్లో కూడా ఇది ఓ రియాల్టీ షో అనే ఫీలింగ్ వస్తుందన్న భావనలో జూనియర్ ఉన్నాడు. అసలే మాంచి టైమింగ్ తో పంచులేసే తారక్ కి స్వేచ్ఛ దొరికితే ఎలా చెలరేగిపోతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Bigg Boss Show  Writer  

Other Articles