Senior Director Alleges Youngsters Insult Dasari Death

Relangi sensational comments on dasari death

Relangi Narasimha Rao, Relangi Dasari, Darshaka Ratna Youngsters, Tollywood Neglect Dasari Death, Dasari Death Youngsters, Dasari Death Insulted, Youngsters Insult dasari, Dasari Homage

Senior Director Relangi Narasimha Rao Comments on Dasari Narayana Rao. Youngsters not pay homage to Darshaka Ratna even in city.

దాసరి మరణంపై రేలంగి సంచలన వ్యాఖ్యలు

Posted: 07/26/2017 05:08 PM IST
Relangi sensational comments on dasari death

వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి చెంది రెండు నెలలపైగానే గడుస్తోంది. చనిపోయిన తర్వాత ఓ సంస్మరణ సభను నిర్వహించిన మా పెద్దలు, ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. మరోపక్క ఆ టైంలో మిస్సయిన స్టార్ హీరోలు కూడా ఎక్కడా ఆయన గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇలాంటి టైంలో దాసరిని కొందరు యంగ్ హీరోలు అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలే చేశాడు ఓ సీనియర్ దర్శకుడు.

రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి హీరోలతో కామెడీ చిత్రాలను తీసిన దర్శకుడు రేలంగి నరసింహరావు ఈ కామెంట్లు చేశాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన దర్శకరత్నకు ఇండస్ట్రీ నుంచి అసలు సరైన గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి చనిపోయిన సమయంలో అగ్రహీరోలైన చిరు, బాలయ్య లాంటి వాళ్లు ఇక్కడ లేరు. మరోపక్క అమెరికాలో జరుగుతున్న తానా ఉత్సవాల్లో రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజలు అక్కడి వేదికలపైనే స్పందించారు. కానీ, ఇక్కడే ఉన్న యంగ్ హీరోలు మాత్రం దాసరి చివరి చూపుకు రాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు చనిపోతే, వచ్చి చూడాలన్న కనీస బాధ్యత కూడా వీరికి లేదా? అని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండి కూడా సీనియర్ దర్శకుడిని కడసారి చూసేందుకు రాని యంగ్ హీరోలను అస్సలు క్షమించరాదని ఆయన పేర్కొన్నాడు. ఓవైపు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మునిగిపోయిన క్రమంలో ఈ వ్యాఖ్యలను ఎవరైనా పట్టించుకుంటారా? అన్నదే అసలు ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Relangi Narasimha Rao  Dasari Narayana Rao  Tollywood Young Heroes  

Other Articles