ఎమోషనల్ మెసేజ్ తో నిజాలు అబద్ధాలు కావుగా... | After Puri Tarun also Fire on Media about Drug Case

Tarun reacts on drug case probe in facebook

Hyderabad Drug Racket, Tarun, SIT Probe, Actor Tarun, Tarun Facebook, Tarun Fire Media, Media Tarun Case, Tarun Pub Secrets, Actor Tarun Akun Sabharwal, Tarun Inquiry

Hyderabad drug racket. Telgu actor Tarun appeared before SIT. Later Put an emotional message in Facebook and request media to don't spread on rumours.

ఫేస్ బుక్ లో తరుణ్ ఎమోషనల్ మెసేజ్

Posted: 07/24/2017 08:05 AM IST
Tarun reacts on drug case probe in facebook

డ్రగ్స్ కేసులో ప్రాథమిక విచారణ అనంతరం మిగతా వాళ్లలాగే తనకే పాపం తెలీదని టాలీవుడ్ నటుడు తరుణ్ స్పందించాడు. బయట మీడియాతో మాట్లాడినట్లే తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టాడు. తొలినాళ్లలో తనను ఎంతో సపోర్ట్ చేసిన మీడియానే ఇప్పుడు కక్షగట్టినట్టు రూమర్లు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తానేదో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయానని, తన తల్లి స్నేహితురాలి కుమార్తెతో తన వివాహం కుదిరిపోయిందని, తాను నెలలో 15 రోజులు గోవాలో ఉంటానని, తనకు బినామీ పేర్లతో పబ్ లలో వాటాలు ఉన్నాయని... ఇలా రకరకాల ప్రచారాలు తనపై జరిగాయని అన్నాడు.

ఇలాంటి పుకార్లు తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో ఎవరైనా, ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించాడు. మీడియాలో వచ్చే రోజుకొక వార్తతో తన కుటుంబం చాలా క్షోభపడుతోందని, దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపాలని కోరాడు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని వెల్లడించాడు. చట్టంపైన, అకున్ సబర్వాల్ పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని, తానేతప్పు చేయలేదని స్పష్టం చేశాడు.

గోవాలో తనకు వ్యవసనాలు అలవాటు అయ్యాయనని, తానే డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారినని కొన్ని పతాక శీర్షిక లతో వార్తలు రాశాయి. అలాంటిదే అయితే తానిప్పుడు బయటకు వచ్చేవాడిని కాదుగా అని అంటున్నాడు. తానేనాడు చట్టపరిధిని దాటి వ్యవహరించలేదని అన్నాడు. డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పిన తరుణ్... ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actro Tarun  SIT Probe  Drug Case  

Other Articles