Actress Cum Singer Head Shave for Escape from Drug Case

Actress plan to escape in drug case

Britney Spears, Britney Spears Head Shave, Britney Spears Drug Case, Actress Escape Drug Case, Heroine Head Shave, Drug Case Actress Side, Britney Spears Drug Addiction

Popular Singer Britney Spears Head Shave Reason reveal. He try to escape from Drug Test.

డ్రగ్స్ టెస్ట్ లో దొరక్కుండా ఉండేందుకు ఆమె ఫ్లాన్

Posted: 07/20/2017 01:01 PM IST
Actress plan to escape in drug case

టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో టాప్ సెలబ్రిటీల విచారణ ఓవైపు కొనసాగుతూనే ఉంది. ఓవైపు ప్రశ్నల వర్షం కురిపించి నిజాలు రాబట్టడంతోపాటు వైద్య పరీక్షల ద్వారా కూడా నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఎక్సైజ్ అధికారుల సిట్ బృందం బిజీగా ఉంది. అయితే టెస్ట్ లో ఆ విషయం ఎలా బయటపడుతుందో ఇప్పుడు చూద్దాం.

డ్రగ్స్ తీసుకుంటే, దాని అవశేషాలు రక్తంలో నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి. లాలాజలంలో మూడు రోజుల వరకూ ఉండే యాంఫిటమైన్ అవశేషాలు, కురులలో అయితే, మూడు నెలల వరకూ ఉంటాయి. కాగా, హెరాయిన్, మరిజువానా, కొకైన్ తదితర మాదకద్రవ్యాలు వాడితే, దాని అవశేషాలు 90 రోజుల వరకూ వెంట్రుకల్లో ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీలు వాడిన డ్రగ్స్ కూడా వీటికి సంబంధించినవే. అందుకే నిన్న పూరీ విచారణ సందర్భంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమునాలను సేకరించారు.

ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఓ నటి చేసిన వ్యవహారం వింటే ఎవరైనా షాక్ కావాల్సిందే. అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు తెలీకుండా ఉండేందుకు తన తెలివితేటలను ప్రదర్శించింది. గతంలో యాంఫిటమైన్ డ్రగ్స్ వాడిన ఆమె తర్వాత భర్తతో విడిపోయింది. పిల్లల సంరక్షణ తనకు అప్పగించాలని కోర్టులో వేడుకోగా, ఆమె ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతుందని, అలాంటప్పుడు పిల్లలను ఎలా అప్పగిస్తానని వాదించాడు. దీంతో కోర్టు పరీక్షలను ఆదేశించింది. విచారణలో తేలకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుంది. మత్తుమందుల అవశేషాలు కురులలో లభిస్తే, తన పిల్లల సంరక్షణ మాజీ భర్త కెవిన్ ఫెడర్లైన్ కు అప్పగిస్తారన్న భయంతోనే ఆమె ఈ పని చేసినట్టు బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Britney Spears  Head Shave  Drug Case  

Other Articles