చిరు పక్కన ఛాన్స్ ఇచ్చి తీసేశారు.. ఎవరు? | Senior Heroine Was Opted Out From Chiru's Movie

Senior actress about lost chance with chiru

Actress Aamani, Actress Aamani Latest Interview, Actress Aamani Chiranjeevi, Aamani Jagapathi Babu Affair, Aamani about Tollywood, Aamani about Chiranjeevi, Aamani Soundarya, Aamani Miss Chiru Movie

Actress Aamani shared her worst experience in the cinema industry. Aamani said that she was selected for a tour in America, which was organised by Paruchuri brothers and she said that tour was about a month's duration. Aamani revealed that she got the opportunity to work with Chiranjeevi after agreeing for the America show and she explained that she opted out from that show for Chiru's film. Finally, Aamani told that she missed both the opportunities. Watch to listen to Aamani.

చిరు పక్కన ఛాన్స్ ఇచ్చి మరి తీసేశారు: ఆమని

Posted: 07/19/2017 06:26 PM IST
Senior actress about lost chance with chiru

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దంపాటు హీరోయిన్ గా రాణించటం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడున్న హీరోయిన్లకు అది కత్తిమీద సాము లాంటిదే. ఎప్పటికప్పుడు వచ్చే ఫ్రెష్ అందాల మధ్య పోటీ నెలకొనటమే ఇందుకు కారణం. అయితే 90వ దశకంలో ఇలాంటి సమస్య అంతగా ఉండేది కాదు. ప్రతీ హీరోయిన్ కు దాదాపుగా అందరు స్టార్ హీరోల పక్కన చేసే ఛాన్స్ దక్కేది. పైగా ఒక సినిమాలో ముగ్గురు, నలుగురు ఒకేసారి కలిసి చేసిన దాఖలాలు ఉన్నాయి.

అలాంటి హీరోయిన్లలో ఆమని కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల‌ను రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె పంచుకుంది. అఫైర్లు, రూమర్లను కూడా తాను చాలా లైట్ గా తీస్కునేదంట. అయితే తనని దారుణంగా బాధించిన విషయం మాత్రం ఒకటి ఉందని చెప్పింది ఆమని. అదే చిరంజీవితో ఛాన్స్ మిస్సయిన మూమెంట్ అంట. ఆ టైంలో తాను చాలా ఏడ్చేశానని ఈ సీనియర్ నటి అంటోంది.

 

మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి తాను ఒక సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అందులో సౌందర్యతోపాటు తాను నటించాల్సి ఉంది. కానీ, అదే సమయానికి అమెరికాలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ వారి టూర్‌కి నేను ఒప్పుకున్నాను. అయితే చిరు సినిమా ఛాన్స్ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదనుకుని ఆ ఈవెంట్ ను వదిలేశాను. తీరా వెళ్లి చూస్తే చిరంజీవి సినిమాలో నుంచి న‌న్ను తీసేశార‌ని చెప్పారు. అటు టూరు, ఇటు మెగాస్టార్ ప‌క్క‌న హీరోయిన్ అవ‌కాశం కోల్పోవటంతో దిగాలుగా కూర్చుంటే ఇండస్ట్రీలో తనకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ సౌందర్యే వచ్చి ఓదార్చిందని ఆమ‌ని వివ‌రించింది. అయితే తనకు అవకాశం రాకుండా చేసింది ఎవరన్న విషయం మాత్రం ఆమె ప్రస్తావించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Aamani  Chiranjeevi Movie  Latest Interview  

Other Articles