టాలీవుడ్ బర్నింగ్ ఇష్యూ.. విశాల్ వదిన ఎంత సీరియస్ అయ్యిందంటే.. | Vishal Sister in law serious on Drug Case

Kollywood actress reacts on tollywood drugs case

Shriya Reddy, Shriya Reddy Interview, Shriya Reddy Tollywood, Shriya Reddy Drug Case, Shriya Reddy Tollywood Drug Case, Tollywood Reputation Drug Issue, Kollywood actress Drug Case

Actress Shriya Reddy serious reaction on Tollywood Drug case. Telugu reputation spoil with this controversy she mentioned at an event.

డ్రగ్స్ రాకెట్ తో టాలీవుడ్ పరువు తీసేశారు

Posted: 07/18/2017 03:23 PM IST
Kollywood actress reacts on tollywood drugs case

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో స్టార్ల విచారణ రేపటి నుంచే ప్రారంభం కానుంది. దర్శకుడి పూరీతోనే మొదలుపెట్టాలని సిట్ నిర్ణయించగా, ఇందుకోసం ఏర్పాట్లన్నీ సిద్ధమౌతున్నాయి. ఛార్మి, బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ అయిన ముమైత్ ఖాన్, సుబ్బరాజు, శ్యాంకే నాయుడు, రవితేజ, నవదీప్, తరుణ్ ఇలా రోజుకోకరి నుంచి వీలైనంత సమాచారం రాబట్టే యత్నం చేయాలని డిసైడ్ అయ్యింది. ఇక ఇప్పటిదాకా ఈ టాపిక్ పై టాలీవుడ్ ప్రముఖులంతా మాట్లాడేయగా, కోలీవుడ్ నుంచి కూడా నెమ్మదిగా రియాక్షన్ మొదలైంది.

నటి శ్రీయా రెడ్డి ఈ ఇష్యూపై కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది. మత్తుమందులకు అలవాటు పడ్డ కొందరు టాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ పరిశ్రమ పరువు తీసేశారంటూ ఓ రేంజ్ లోనే ఏకీ పడేసింది. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఓ బొమ్మల దుకాణాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడింది. డ్రగ్స్ మాఫియాలో సెలబ్రిటీలు చిక్కుకోవటం దురదృష్టకరమని అంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయటపడాలని, నేరం రుజువైతే మాత్రం కఠిన శిక్ష పడాల్సిందేనని అంటోంది.

తాను తెలుగులో నటించానని, అక్కడి వ్యక్తులు ఎంతో ఆదరిస్తారు కాబట్టే ఇండస్ట్రీ బాగును కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. విశాల్ 'పొగరు' సినిమాతో పాప్యులర్ అయిన ఆమె అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాలతో టాలీవుడ్ కు పరిచయమే. హీరో విశాల్ అన్నయ్యను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉందన్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తరువాత ఆమె ‘అండావ కానోమ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriya Reddy  Drug Case  Kollywood  

Other Articles