డ్రగ్ మత్తులో నోటీసులు అందుకున్నది వీళ్లే! | Puri Jagannadh and Close Associates in Drug Mafia

Sit notices top tollywood celebrities

Tollywood News, Tollywood Drug mafia, Tollywood 10 Celebs Drug, Drug Case, Excise Enforcement Notices, Telugu Actress Drug Mafia, Tollywood Drug Consumption, Puri behind Drug Mafia, Raviteja Drug Mafia, Drug Danda, Tollywood Celebs Names in Drug Links

Director Puri Jagannadh and his close associates are involved in consuming drugs.Ace hero Raviteja, his friend and popular director Puri Jagan, his 'Puri Connects' friend and heroine Charmi, Item siren Mumaith Khan, Cinematographer Shyam K Naidu, good friend Subbaraju and art director Chinna are said to be involved in consuming drugs. Other heroes like Tarun, Navdeep, Srinivasa Rao, Tanish also got notices from the Excise Enforcement officials as per the reports.

బిగ్ షాక్: డ్రగ్స్ రాకెట్ లో రవితేజ, పూరీ, ఛార్మీ తదితరులకు నోటీసులు

Posted: 07/14/2017 11:09 AM IST
Sit notices top tollywood celebrities

డ్రగ్స్ దందాలో ఉన్న టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు వెళ్లగా, వాళ్లకు సంబంధించిన హింట్ లు నిన్నంతా హల్ చల్ చేశాయి. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, మొమైత్ ఖాన్, తరుణ్, సుబ్బరాజు, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్ తదితరులు 10 మందిలో ఉన్నారు. వీరితోపాటు టాప్ హీరో హీరో రవితేజకూ నోటీసులు వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

అయితే రవితేజ సోదరుడు, ఇటీవల మరణించిన భరత్ పేరు కెల్విన్ కాల్ లిస్టులో ప్రముఖంగా కనిపించిందని సమాచారం. ఇక స్వయంగా రవితేజ కస్టమర్ గా ఉండి డ్రగ్స్ వాడడం వల్ల, ఈ నోటీసులు ఇచ్చారా? లేక తమ్ముడి డ్రగ్స్ వాడకంపై మరింత సమాచారం కోసం విచారించనున్నారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది. మరోపక్క శ్రీనివాసరావు, రవితేజలకు ఓ నైజీరియన్ ముఠా డ్రగ్స్ సరఫరా చేసిందనే టాక్ వినిపిస్తోంది. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకూ సిట్ కార్యాలయంలోనే విచారణకు హాజరు కావాల్సి వుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే హాజరు కావాలని, రాకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

వాళ్లకు ముందే తెలుసు...

విచారణలో పేర్లు బయటకు వస్తుంటే విస్తుపోయిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం అధికారులు, ఆ సమాచారాన్ని తొలుత సినీ పెద్దలకు చేరవేసినట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖుల పేర్లన్నింటినీ లిస్ట్ చేసి అకున్ సబర్వాల్ కు ఇవ్వగా, హై ప్రొఫైల్ వ్యక్తుల చుట్టూ సాగే విచారణ కాబట్టి, ప్రభుత్వానికి, సినిమా రంగంలో పేరున్న వ్యక్తులైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పెద్దలకు ఈ జాబితాను ఇచ్చి వారి నుంచి కూడా సలహా తీసుకున్నట్టు సమాచారం.

డ్రగ్స్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టవద్దని వారి నుంచి వచ్చిన సూచనతోనే నోటీసులు ఇచ్చేందుకు సిట్ ముందుకు కదిలింది. విషయంలోని తీవ్రతను ముందుగానే తెలుసుకున్నారు కాబట్టే రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన పరిశ్రమ పెద్దలు ప్రెస్ మీట్ లో కాస్తంత గట్టిగానే మాట్లాడారు. విచారణకు తమ వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని కూడా వారు సిట్ కు వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఇంకా ఉన్నారా?

తవ్వేకొద్దీ బయటపడ్డ మొత్తం 40 మంది ఈ జాబితాలో ఉండగా, కేవలం 10 మందికి మాత్రమే ఇప్పటి వరకు నోటీసులు పంపించామని సిట్ అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ కు బానిసలై వాడుతూ ఉంటే, కౌన్సెలింగ్, రీహాబిటేషన్ సెంటర్లకు సిఫార్సులు చేస్తామని, వారు వేరే వారికి ఇవ్వడం లేదా విక్రయించడం చేసినట్టు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక టాలీవుడ్ లో మత్తు దందాపై నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు అకున్ సబర్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

 

వాళ్ల స్పందన ఇది...

డ్ర‌గ్స్ రాకెట్ వ్య‌వ‌హ‌రంలో ఇరుకున్న ఒక్కొక్క‌రు త‌మ వాద‌న‌లు ఇలా వినిపించారు. హీరో న‌వ‌దీప్ త‌న‌కి నోటీసులు అందాయి కాని, నేనెప్పుడు ఎలాంటి త‌ప్పు చేయలేదు. అన‌వ‌స‌రంగా నాపై లేని పోని ప్ర‌చారాలు చేస్తున్నారు. కెల్విన్ అనే వ్య‌క్తి ఎవ‌రో కూడా నాకు తెలియ‌దు. ఇటీవ‌ల ఓ రాంగ్ ఈవెంట్ వారితో క‌లిసి ప‌ని చేయ‌డం, నా నెంబ‌ర్ వారి దగ్గ‌ర ఉండ‌డం వ‌ల‌న‌నే న‌న్ను విచార‌ణ‌కు పిలిపించారు. విచార‌ణ‌లో పాల్గొని సిట్ వారికి స‌హ‌క‌రిస్తాన‌ని న‌వ‌దీప్ అన్నాడు. గ‌తంలో త‌నపై వ‌చ్చిన డ్రంక్ అండ్ డ్రైవ్ విష‌యాలు కూడా స‌రిదిద్దుకున్నట్టు న‌వ‌దీప్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు.

త‌న జీవితంలో ఎప్పుడు డ్ర‌గ్స్ చూడ‌లేద‌ని, డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు త‌న‌కు లేద‌ని నటుడు, ప్ర‌ముఖ సింగ‌ర్ గీతామాధురి భ‌ర్త నందు అన్నాడు. త‌న భ‌ర్త‌కు అలాంటి అల‌వాట్లు లేవ‌ని గీతా మాధురి కూడా పేర్కొంది. అయితే విచార‌ణ‌లో ఏ ప‌రీక్ష‌కైన తాను సిద్ధ‌మేన‌ని నందు అన్నాడు. దీనిపై పూర్తి విచార‌ణ జ‌రిపి, అస‌లు విష‌యాన్ని మీడియా వెలుగులోకి తేవాల‌ని ఈ యువ న‌టుడు అంటున్నాడు. ఇక ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా కూడా ఈ డ్ర‌గ్స్ రాకెట్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, ఇలాంటి అల‌వాట్లు త‌న‌కు లేవ‌ని క్లారిటీ ఇచ్చాడు. త‌న‌కు ఇంత వ‌ర‌కు అధికారుల నుండి ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని ఆయ‌న అన్నాడు.

ఇక యువ హీరో త‌నీష్ డ్రగ్స్ కేసులో త‌న పేరు ఉండ‌టంపై విచార‌ణ వ్య‌క్తం చేశాడు. డ్ర‌గ్స్ తీసుకునే జాబితాలో త‌న పేరు ఉండ‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మీడియాలో వ‌స్తున్న వార్త‌లు త‌న కుటుంబ సభ్యుల‌ని తీవ్ర ఆందోళ‌నకు గురి చేస్తున్నాయ‌ని అన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నోటీసులు అంద‌లేదు, అధికారులు పిలిస్తే త‌ప్ప‌క విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని త‌నీష్ అన్నాడు.

సపోర్టింగ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు తాను ఇంత వ‌ర‌కు ఇంగ్లీష్ మెడిస‌న్ వాడ‌లేద‌ని, అలాంటింది డ్ర‌గ్స్ ఎందుకు వాడ‌తాన‌ని అంటున్నాడు. ఈ కేసు విష‌యంలో పోలీస్ అధికారి వచ్చి నోటీసులు ఇవ్వ‌డంతో షాక్ అయ్యాన‌ని, ఇందులో ఆరేడు ర‌కాల డ్ర‌గ్స్ పేర్లున్నాయ‌ని సుబ్బ‌రాజు తెలిపాడు. నాకు తెలిసినంత వరకు ఈ జాబితాలో ఎవరూ డ్రగ్స్ తీసుకోరని సుబ్బరాజు అన్నాడు. ఆరోగ్యం పట్ల నేను ఎంత శ్రద్ధ తీసుకుంటానో సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసని అన్నాడు. డ్ర‌గ్స్ వ‌ల‌న వచ్చే ఎక్స్ ట్రా ఆనందం త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, ఇప్పుడు సంతోషంగానే ఉన్న‌ట్టు ఆయ‌న తెలిపాడు. వ్య‌వ‌స్థ‌కి వ్య‌తిరేఖంగా ఉండ‌ని ఆయ‌న త‌ప్ప‌క విచార‌ణ‌కి హాజ‌రు అవుతాడ‌ని తెలిపాడు.

ఇక ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ సోష‌ల్ మీడియా ద్వారా త‌నెలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ఇండైరెక్ట్ గా ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. త‌న ట్విట్ట‌ర్ లో “నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేసి చిన్నబుచ్చినా.. నువ్వు ఏమీ బాధ పడాల్సిన‌ అవసరం లేదు. వాళ్ళు అలా చేస్తున్నారు అంటే అది కేవలం నీ దైర్యాన్ని దెబ్బ తీయడానికే. నువ్వు వాళ్ళకన్నా గొప్పగా ఆలోచిస్తే నిన్ను ఎలా అవమానపరుస్తారు'' అంటూ మెసేజ్ ఇచ్చింది . అంటే ఛార్మి తాను నిర్ధోషిగా నిరూపించుకునేందుకే ఈ పోస్ట్ పెట్టిందా అని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు అన్నాడు . మీడియాలో ఎక్కువ‌గా క‌నిపించ‌ని నాపై ఇలాంటి వార్త రావ‌డం బాధ‌గా ఉంద‌ని ఆయ‌న అన్నాడు. ఈ ప్ర‌చారం వ‌ల‌న త‌న కుటుంబ స‌భ్యులు చాలా బాధ ప‌డుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నాడు. మా కార్యవర్గం శివాజీ రాజా, నరేష్ లతోపాటు మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కూడా దీనిపై స్పందించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Mafia  Excise Notices  

Other Articles