Die Hard Fan wants to Make a Movie with Balayya

Onve upon a time jagan wants to produce balayya

Balakrishna, Nandamuri Balakrishna, YS Jagan Balayya Movie, Jagan Balayya Movie, Jagan Produce Balayya, Balayya Jaganmohan Reddy, YS Jagan Balayya

YSRCP Chief, AP Opposition Leader YS JaganMohan Reddy Once Plan a Movie with Balakrishna. Jagan well known as Balayya's Fans President wants to produce him.

వన్స్ అప్ అన్ ఏ టైం.. వీళ్లిద్దరి సినిమా?

Posted: 07/13/2017 06:54 PM IST
Onve upon a time jagan wants to produce balayya

వీరాభిమానులకే కాదు.. మిగతా తెలుగు ప్రేక్షకులకు కూడా బాలయ్య అంటే ఓ ప్రత్యేక అభిమానం ఉంటుంది. డైలాగుల్లోని పౌరుషం, ఆ గాంభీర్యం అబ్బో... అయితే కేవలం ఈ అభిమానం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఉంది. ముఖ్యంగా పొలిటీషియన్లలో కూడా నందమూరి నటసింహానికి ఫాలోయింగ్ ఉండగా, అందులో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒకడు.

ఇంతకు ముందు బాలయ్య ఫ్యాన్స్ అసోషియేషన్ కు జగన్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. పైగా అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలలో బాలయ్య ఒక్కడే ఉత్తముడంటూ కితాబిచ్చాడు కూడా. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అవును... ఈ సంగతి నిజమేనంట!

బాలయ్య మీద ఉన్న అభిమానంతో 2003లో నిర్మాతగా మారి ఆయనతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీయాలని జగన్ ప్లాన్ చేశారట. అయితే అప్పటికే వైయస్, చంద్రబాబుల మధ్య రాజకీయ పరంగా విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో... జగన్ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదట. అలా జగన్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆయన కల నెరవేరలేదు. ఇద్దరివీ వేర్వేరు పార్టీలు, పైగా ప్రత్యర్థులు అయినప్పటికీ అభిమానం మాత్రం మారలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jaganmohan Reddy  Nandamuri Balakrishna  TollYwood News  

Other Articles