Tollywood Young Hero's Wife slams Suicide Rumours

Hero wife laughs at suicide rumour

Varun Sandesh, Varun Sandesh Wife, Vithika Sheru, Vithika Sheru Suicide Rumour, Vithika Sheru Death News, Vithika Sheru Tortured, Varun Sandesh Harass Wife, Tollywood Hero Harass Wife, Varun Sandesh Vithika Sheru on Fake News, tollywood Fake News, Vithika Sheru Rumours, Vithika Sheru Photos, Actress Suicide Attempt,

Telugu actor Varun Sandesh's wife Vithika Sheru clarifies suicide rumours. She attempted suicide at her residence in Hyderabad on Tuesday went viral causing panic among the film circles.Later Actress Condemns that fake news in Twitter.

వరుణ్ సందేశ్ టార్చర్... భార్య వితిక సూసైడ్ అటెంప్ట్?

Posted: 07/12/2017 09:57 AM IST
Hero wife laughs at suicide rumour

టాలీవుడ్ లో యువ నటి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. నటుడు వరుణ్ సందేశ్ భార్య, నటి అయిన వితికా శేర్ ఆత్మహత్యా యత్నంకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వరుణ్ వేధింపుల కారణంగానే ఆమె మనస్థాపం చెంది ఈ ఘోరానికి పాల్పడిందంటూ కొన్ని వెబ్ సైట్లు కూడా పుకార్లు లేపాయి. దీంతో ఆమె స్పందించింది.

తాను నిక్షేపంగా ఉన్నానని, అసలు ఆ వార్తలో కొంచెం కూడా నిజం లేదని స్పష్టం చేసింది. వరుణ్ తనను చాలా బాగా చూసుకుంటున్నాడని, ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మ తనకేం పట్టలేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చేసింది. గతంలో నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయినప్పుడు డోస్ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యానని, అప్పటి ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేస్తూ, తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని, తనను ఆసుపత్రిలో చేర్చారని కథలు అల్లుతున్నారని పేర్కొంది.

మాదాపూర్ లో ఓ కార్యక్రమంలో తాను ఉండగా, తన బంధువులతోపాటు స్నేహితులు కూడా ఫోన్ చేసి 'సూసైడ్ అటెంప్ట్ చేశావా?' అని అడగ్గా, తాను షాక్ తిన్నట్లు చెప్పింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో రేగిన పుకార్ల ఆధారంగానే వాళ్లు అలా చేశారని అర్థమైందని, వాటిని చూసి తన భర్త, తాను నవ్వుకున్నామని ఆమె తెలిపింది.

పడ్డానండి ప్రేమలో మరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Sandesh Wife  Vithika Sheru  Suicide Attempt  Tollywood Gossips  

Other Articles