NTR Didn't Know Anything about NTR Biopic

Ntr at bigg boss press meet

NTR, NTR Bigg Boss, NTR Big Boss Press Meet, NTR Press Meer, NTR on NTR Biopic, Junior NTR on Ram Gopal Varma, Junior NTR RGV, NTR Not in NTR Biopic, NTR on Rumours, NTR Reveal Bigg Boss Remuneration, NTR About Bigg Boss

Junior NTR responded on Legendary NTR Biopic. He didn't know anything about that. NTR Interacts with Media at Bigg Boss Press Meet.

మీట్ బిగ్ బాస్.. ఫ్లాప్ అయినా ఫర్వాలేదు!

Posted: 07/08/2017 11:57 AM IST
Ntr at bigg boss press meet

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా లో జూనియర్ నటిస్తున్నాడా? బాబాయ్ బాలయ్య నటించటంపై అబ్బాయ్ రియాక్షన్ ఏంటి?. బిగ్ బాస్ షో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ వీటన్నింటికి సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ అంటే ఒక కుటుంబానికి చెందిన ఆస్తి కాదనేది తన ప్రగాఢ నమ్మకమని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీయడమంటే... తెలుగువారి బయోపిక్ తీయడమేనని చెప్పుకొచ్చాడు. 

తాతయ్యా బయోపిక్ లో బాబాయ్ బాలకృష్ణ నటించటం అద్భుతమని తెలిపాడు. ఆ సినిమాలో మీరు కూడా నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా... ఆ విషయం గురించి ఏమీ తెలియదన్నాడు.మరోవైపు, ప్రముఖ దర్శకుడు వర్మ ఎన్టీఆర్ సినిమాను తీస్తానని... అందులో పలు వివాదాస్పద అంశాలు ఉంటాయనే ప్రకటనను ప్రస్తావించగా, వాటికి తెలియనే సమాధానం ఇచ్చాడు. సినిమా వచ్చేంత వరకు ఏమీ చెప్పలేనని తెలిపాడు.

పూర్తి వీడియో కోసం క్లిక్ చేయండి

ఇక బిగ్ బాస్ కోసం బాడీ లాంగ్వేజ్ పరంగా తానేమీ ప్రిపేర్ కాలేదని, బయట ఎలా ఉంటానో.. స్క్రీన్ పై కూడా అలానే కనిపిస్తానని చెప్పాడు. రెమ్యునరేషన్ గురించి బయట మీరు చెప్పుకునేంత కాకపోయినా కాస్త తక్కువగానే అందుకున్నట్లు నవ్వుతూ బదులిచ్చాడు. మనందరం తెలిసో, తెలియకో సోషల్ మీడియా కారణంగా ఒక పబ్లిక్ ఫ్లాట్ ఫాం మీదకి వచ్చామని అన్నాడు. అందువల్ల ఎవరు ఎలా ఉంటారు? ఎలా వ్యవహరిస్తారు? ఎలా ఉండాలనుకుంటారు? అన్న విషయాలన్నీ తెలిసిపోతున్నాయని, బిగ్ బాస్ షో కూడా అలాంటి షోనేనని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Bigg Boss  NTR Biopic  

Other Articles