Finally Soundarya Rajinikanth Officially Divorced

Divorce granted for rajini daughter

Rajinikanth, Rajinikanth Daughter Divorce, Soundarya Rajinikanth, Soundarya Rajinikanth Divorce, Soundarya Rajinikanth Ashwin, Soundarya Rajinikanth Divorce Reason, Soundarya Rajinikanth Chennai Family Court, Soundarya Rajinikanth VIP 2, Soundarya Rajinikanth New movie, Rajinikanth Soundarya

Superstar Rajinikanth's younger daughter Soundarya has been granted divorce from Ashwin. Chennai Family Court court grants divorce after mutual consent.

రజనీ చిన్న కూతురు.. అఫీషియల్ గా చెప్పేశారు

Posted: 07/05/2017 09:59 AM IST
Divorce granted for rajini daughter

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ చిన్న కుమార్తె సౌందర్య తన వైవాహిక బంధానికి అధికారికంగా ముగింపు పలికేసింది. భర్తతో సౌందర్యకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది. భర్తతో విభేదాల కారణంగా ఆమె తండ్రితోపాటే ఉంటున్న విషయం తెలిసిందే.

రజనీ రెండో కుమార్తె అయిన సౌందర్యకు 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌ కుమార్‌ తో వివాహం జరిగింది. వీరికి వేద్ అనే బాబు ఉన్నాడు. నాలుగేళ్ల తర్వాత వీళ్ల కాపురంలో కలతలు రేగాయి. తరువాత అవి పెరిగి వారిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. దీంతో సౌందర్య భర్తకు దూరంగా పుట్టింటికి వచ్చేసింది. వారి సమస్యలు పరిష్కరించేందుకు రజనీకాంత్, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో గత సెప్టెంబర్ లో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు.

చివరకు మళ్లీ కలిసేది లేదని నిర్ణయించుకున్న తర్వాత న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. అయితే బాబు సంరక్షణ గురించి తన ఉత్తర్వులలో న్యాయవాది పేర్కొనలేదు. తాను సౌందర్య రజనీకాంత్ ఐడెంటిటీతోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆమె భర్తకు దూరమైందంటూ కొన్ని కథనాలు రాగా, భర్త అఫైర్ మూలంగానే అంటూ మరికొన్ని మీడియా ఛానెలు పుకార్లు రేపాయి. కారణాలేవైతేనేం మొత్తానికి సౌందర్య ఇప్పుడు తన కెరీర్ మీదే దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం సౌందర్య డైరక్షన్ వహించిన 'వీఐపీ-2' జూలై చివరి వారంలో విడుదలకు సిద్ధమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Soundarya  Ashwin  Divorce  

Other Articles