Senior Actress Refused Bigg Boss Show's Bumper Offer

Senior actress explain to refuse bigg boss offer

Tamil Bigg Boss Show, Bigg Boss Show, Lakshmi Ramakrishnan Bigg Boss Show, Lakshmi Ramakrishnan 10 Crores, Lakshmi Ramakrishnan Directorial Debut, Lakshmi Ramakrishnan New Movie, Kamal Haasan Bigg Boss Show

Kollywood Senior Actress Lakshmi Ramakrishnan explained why she refuse Bigg Boss Tamil Version. She was busy with movies and not want to spent much days in house to left her family.

బిగ్ బాస్ బంఫరాఫర్.. ఎందుకు వదులుకుంది?

Posted: 07/05/2017 12:27 PM IST
Senior actress explain to refuse bigg boss offer

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు బాలీవుడ్ లో భలే డిమాండ్ ఉంది. కాంట్రవర్సీ కాండిడేట్ లను ఎంచుకుని వారితో నెలల తరబడి ఒకే ఇంట్లో కెమెరా నిఘాలో షో నిర్వహించటం కాస్తతంత కష్టమే. ముఖ్యంగా అన్నేసి రోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం, పైగా మరిన్ని వివాదాలకు భయపడి సెలబ్రిటీలు ముందుకు రారనే అనుకుంటారు. కానీ, హిందీ షో కు మాత్రం ఇప్పటిదాకా అలాంటి అటంకాలు ఎదురు కాలేదు. ఎటొచ్చి సౌత్ దగ్గరే ఈ సమస్య మొదలయ్యింది.

కన్నడను మినహాయిస్తే ప్రస్తుతం తమిళ్ లో ఈ షో రన్ అవుతోంది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్' మెల్లిగా నెగటివ్ టాక్ నుంచి టీఆర్పీని పెంచేసుకుంటుంది. నటుడు శక్తి, శ్రీ, హాస్యనటుడు వయ్యాపురి, గంజాకరుప్పు, నటి నమిత, అనూయ, ఓవియాలతో పాటు మొత్తం 15 మంది పాల్గొంటున్నారు. వీరిలో అనూయ, శ్రీ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు కూడా. అయితే షో కోసం ముందుగా సీనియర్ నటి లక్ష్మీరామకృష్ణన్‌ కి భారీ ఆఫరే ఇచ్చినప్పటికీ ఆమె తిరస్కరించింది. దీనిపై ఆమె ఇప్పుడు క్లారిటీ ఇస్తోంది.

పది కోట్లిచ్చినా అలాంటి పనికి మాలిన షోలో పాల్గోనని స్పష్టం చేసింది. 'బిగ్ బాస్' లో పాల్గొనేందుకు తనను సంప్రదించారని, అయితే వంద రోజులపాటు కుటుంబాన్ని వదిలి ఉండాలన్న షరతును అంగీకరిచలేక ఆఫర్ వదులుకున్నానని ఆమె చెప్పారు. అంతే కాకుండా తాను దర్శకత్వం వహించే సినిమా చిత్రీకరణ జరుగుతోందని, మరోవైపు పలు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపింది. ఇంకోపక్క తెలుగులోనూ ముందు ఇలాంటి వాదనే వినిపించినా ఇప్పుడు జూలై 16 నుంచి షో కన్ఫర్మ్ కావటంతో జూనియర్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Bigg Boss Show  Lakshmi Ramakrishnan  

Other Articles