Telugu Bigg Boss Not My Range Show says KA Paul

Ka paul clarity on bigg boss show

KA Paul, KA Paul Bigg Boss, KA Paul NTR, Paul Not Interested Bigg Boss, Posani KA Paul, KA Paul Fake News, Paul Not Bigg Boss, KA Paul, Controversial Christian Preacher

No, KA Paul not in Telugu Bigg Boss show. Controversial Christian Preacher says Junior Hosting show not his range.

బిగ్ బాస్ కి రమ్మంటే పాల్ గారు బ్లెస్సింగ్ ఇచ్చారే!

Posted: 06/30/2017 09:16 AM IST
Ka paul clarity on bigg boss show

కాంట్రవర్సీ లు అయ్యే విషయాలపై జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. అందుకే ఆ కీ పాయింట్ పట్టేసుకుని ఛానెల్ కూడా స్పెషల్ ప్రోగ్రాంలు చేస్తూ టీఆర్పీని తెచ్చేసుకుంటాయి. ఇంటర్వ్యూలు, రియాల్టీ షోలు ఇలా అన్నమాట. అందుకోసం భాష బేధం లేకుండా కాన్సెప్ట్ లను ఎత్తేస్తుంటాయి. జెన్యూన్ గా చెప్పాలంటే తెలుగులో త్వరలో బిగ్ బాస్ షో బ్రిటన్ నుంచే బాలీవుడ్ దిగుమతి చేసుకుందన్నది చాలా తక్కువ మందికి తెలుసు.

త్వరలో యంగ్ టైగర్ హోస్టింగ్ లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ తెలుగు వర్షన్ కోసం కాస్త వివాదాస్పద పార్టిసిపెంట్ లనే ఎంచుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోసాని, సుమ లు ఆ ఆఫర్ ను తిరస్కరించగా, ఇప్పుడు మరో పేరు వార్తల్లో చక్కర్లు కొడుతోంది. తన వెరైటీ స్పీచ్ లు, ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న కేఏపాల్ ను హౌజ్ కు రప్పించే యత్నం చేస్తున్నారని టాక్ నడిచింది.

అయితే దీనిపై కేఏపాల్ రియాక్ట్ అయ్యాడు. రెమ్యునరేషన్ తీసుకుని షో కి వెళ్లాల్సిన అవసరం తనకేం లేదని, అసలు బిగ్ బాస్ తన రేంజ్ కి తగ్గ షో కాదని చెబుతున్నాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ కి, ఆ షోకి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, బాలీవుడ్ టీఆర్పీని క్రాస్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమంటున్నాడు. సో... ఇది కూడా పోసాని అండ్ హై రెమ్యునరేషన్ న్యూస్ లాంటిదేనన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Bigg Boss Show  KA Paul  Fake News  

Other Articles