Singer Karunya allegations on Music Directors

Popular telugu singer on controversies

Snger Kaunya, Karunya Hema Chandra, Karunya Tollywood Music Directors, Hema Chandra Clashes Karunya, Karunya No Offers, Karunya Tollywood Singer

Indian Idle Runner Kaunya Comments on Tollywood Directors. No Clashes with singer Hema Chandra he Clarified.

హేమచంద్రతో గొడవ.. వాళ్ల మూలంగానే పాడలేకపోతున్నా!

Posted: 06/27/2017 05:08 PM IST
Popular telugu singer on controversies

ఇండియన్ ఐడల్ టైటిల్ ను తృటిలో పోగొట్టుకున్న కారుణ్య తర్వాత ప్లేబాక్ సింగర్ గా బాలీవుడ్, టాలీవుడ్ లో రాణిస్తాడని అంతా ఆశించారు. కెరీర్ మొదట్లో అదే స్థాయిలో ఊపు చూపించాడు కూడా. కానీ, అది యేడాదికి మాత్రమే పరిమితమైంది. అవకాశాలు ఇవ్వట్లేదా? లేదా ఇచ్చినా రాణించలేకపోతున్నాడా? అసలేంటి సమస్యో అతన్నే అడగానికి ట్రై చేసింది ఓ మీడియా సంస్థ. ఆ ఇంటర్వ్యూలో బోలెడన్నీ విషయాలు వెల్లడించాడు.

తనకు పేరు వచ్చాక చాలా పెద్ద పెద్ద సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కానీ, కావాలనే వాటిని వదులుకున్నాడంట. అందుకు కారణం ఆ సినిమాల మ్యూజిక్ డైరక్టర్లే అని చెబుతున్నాడు. తెలుగును ఖూనీ చేస్తూ పాడమన్నందుకే తాను ఛాన్సులు వదులుకున్నానంట. ఓ పాట పాడితే తెలుగువాడు పాడినట్టు ఉండకూడదని మ్యూజిక్ డైరెక్టర్లు చెబుతుంటారని, అలాంటప్పుడు తనకు ఇబ్బందిగా ఉంటుందన్నాడు. ఇంకొందరైతే సంగీతం ఫ్రోఫెసర్ లలా ఫీలయిపోయి లేని ఒత్తులను పలకాలని, ఉన్న ఒత్తులను పలకకూడదని చెబుతుంటారని, అలాంటప్పుడు ఓ తెలుగు వాడిగా బాధపడి పాటను వదిలేస్తానని తెలిపాడు.

తాను శాస్త్రీయ నేపథ్యం ఉన్న సంగీతం నుంచే ఓనమాలు దిద్దానని, ఒక తెలుగు వాడిగా తెలుగును తన కళ్లముందే ఖూనీ చేయడాన్ని సహించలేనని చెప్పాడు. నా ప్రవర్తనను ఎలా అర్ధం చేసుకున్నా సరే...ఇప్పటికే భాష ఖూనీ అయిపోతోందని, దానిని మనం కూడా ఖూనీ చేస్తే తెలుగు తల్లి క్షమించదని పేర్కొన్నాడు. ఛాన్సులు రాకపోవటంపై తాను అస్సలు ఫీల్ కావటం లేదని వివరించాడు.

హేమ చంద్ర తో క్లాష్.. చెత్త విషయం

సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్రతో తనకు విభేదాలొచ్చాయని పేర్కొంటూ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయని, అలాంటి వాటిని చూసి తాము నవ్వుకుంటామని సింగర్ కారుణ్య తెలిపాడు. హేమచంద్ర, తాను బావా, బావమరుదులమని, తామిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని అన్నాడు. తమ మధ్య విభేదాలు రావని చెప్పాడు. ఏ విషయంపైనైనా సరే తామిద్దరం మాట్లాడుకోగలమని తెలిపాడు. అయితే చెత్త విషయాలు మాత్రం మాట్లాడుకోమని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Karunya  Tollywood  Music Directors  

Other Articles