Why Rakul Preet Singh did her film in Kannada

Rakul about her debut in kannada

Rakul, Rakul Only Money, Rakul First Movie, Rakul Money, Rakul 5 Lakhs Remuneration, Rakul bollywood, Rakul Siddarth Malhotra, Rakul 2000 Rupees, Rakul Remake Movie, Rakul only for Money, Rakul Money Minded

Rakul Preet Singh open up her debut in Kannada with Gilli. Rakul says she agreed only for the money.

రకుల్ అందుకే ఆ సినిమా చేసిందంట!

Posted: 06/21/2017 05:52 PM IST
Rakul about her debut in kannada

ఎక్కడో ఢిల్లీలో ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో పుట్టిన పంజాబీ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ను ఏలుతుందని ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సౌత్ లో ఆ మాటకొస్తే త్వరలో నార్త్ లోనూ తన సత్తాను చాటేందుకు రెడీ అయిపోతుంది. మోడల్‌గా పనిచేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉన్న విష‌యం తెలిసిందే. కానీ, మొదట ఆమె చేసింది మాత్రం ఓ కన్నడ హీరోయిన్ గానే. ఆ సమయంలో తనకు అసలు ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాన్ని చెబుతోంది రకుల్.

కన్నడ సినిమా గిల్లీలో(7/జి బృందావన్ కాలనీ రీమేక్) న‌టించాల‌ని 2009లో ఆఫర్‌ వచ్చిందంట. అయితే, చ‌దువుకుంటున్న స‌మ‌యంలో సినిమాలు చేయడం త‌న‌కు ఇష్టం లేదని, అయిన‌ప్ప‌టికీ ఆ సినిమా చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.ఆ సినిమా చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారని చెప్పింది. దీంతో ఆ సినిమాలో న‌టించాన‌ని రకుల్ పేర్కొంది. రెండు వేలు పాకెట్ మనీ ఉన్న ఓ అమ్మాయికి అంత డబ్బు వస్తుందంటే ఊరుకుంటుందా? అందుకే మాట్లాడకుండా సినిమా ఒప్పేసుకున్నా.

తర్వాత ఎంతో మంది కన్నడ నిర్మాతలు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి సినిమాల్లో న‌టించ‌మ‌ని అడిగార‌ని, త‌న చదువుపైనే దృష్టిపెట్టాలనే ఉద్దేశంతో ఆ సినిమాల‌కు ఒప్పుకోలేద‌ని చెప్పుకొచ్చింది. త‌న చ‌దువు ముగిశాక మళ్లీ తెలుగులో కెరటం (అది అంతగా ఆడలేదు) సినిమాల్లోకి వ‌చ్చాన‌ని, ఆపై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తన కెరీర్ టర్న్ అయ్యిందని చెబుతోంది. అన్నట్లు త్వరలో బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సినిమాలో నటించే వార్తను కన్ఫర్మ్ చేసింది రకుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Kannada Movies  Debut Movie  

Other Articles