Debut Heroine Three Film Deal with Star Maker

Sridevi daughter three movies sign with karan

Sridevi Daughter, Jhanvi Kapoor, Jhanvi Kapoor Three Movies, Jhanvi Kapoor Dharma Productions, Jhanvi Kapoor New Movie, Jhanvi Kapoor Student of The Year 2, Jhanvi Kapoor Karan Johar, Jhanvi Kapoor New Movie

Sridevi Daughter Jhanvi Kapoor to sign a three-film deal under Karan johar's Dharma Productions.May Confirmed debut with Student of The Year 2.

వావ్ జాన్వీ.. బోణి కొట్టక ముందే మూడు

Posted: 06/21/2017 12:15 PM IST
Sridevi daughter three movies sign with karan

సినిమాలోకి రాకముందే రోజూ వార్తల్లో నానుతూ వస్తున్న శ్రీదేవి కూతురి గురించి చెప్పేది ఏముంటుంది. అఫైర్లు, బాయ్ ఫ్రెండ్స్, పైగా వాళ్లతో ఇంటిమేట్ ఫోటోలు.. తల్లి వారించినా జాన్వీ కపూర్ యవ్వారం అలా ఉంది మరి. అయితే ఎటు తిరిగి ఆమె డెబ్యూ మాత్రం స్టార్ మేకర్ కరణ్ జోహర్ తోనేనన్నది మాత్రం ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ తో జాన్వీ ఎంట్రీకి రంగం సిద్ధం అయిపోయింది. అయితే తన కూతురి వ్యవహారంలో ఎవరి ఇన్ వాల్వ్ మెంట్ అవసరం లేదని, తానే అన్నీ దగ్గరుండి చూసుకుంటుందని శ్రీదేవి చెప్పినట్లు ఆ మధ్య ఓ బాలీవుడ్ పత్రిక కథనం రాసింది. దీంతో కరణ్ కి, శ్రీదేవికి ఏవైనా మనస్పర్థలు తలెత్తాయా? అన్న అనుమానాలు కలిగాయి.

కానీ, ఇక్కడ జాన్వీ విషయంలో జరిగిన కమిట్ మెంట్ లు చూశాక అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఏకంగా కరణ్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్ హౌస్ తో మూడు సినిమాలకు ఒప్పందం పై సైన్ చేసింది జాన్వీ. కాగా, షారూఖ్ దగ్గరి నుంచి అలియా భట్ దాకా కరణ్ ఎందరో స్టార్ ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆదిత్య చోప్రా శ్రీదేవికి ఎలా అయితే లైఫ్ ఇచ్చాడో.. తన కూతురికి కరణ్ అలాగే ఇస్తాడని శ్రీదేవి భావిస్తుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jhanvi Kapoor  Karan Johar  Dharma Productions  

Other Articles