Pooja Hegde Not Responded on Super Star's 25th Movie

Pooja hegde not yet confirmed mahesh movie

Mahesh Babu, Mahesh Babu 25th Movie, Mahesh Babu Vamsi Paidipally Movie, Vamsi Paidipally New Movie, Vamsi Paidipally Pooja Hegde, Super Star 25th Movie, Mahesh Babu New Movie, Mahesh Babu Allu Arjun Heroine, Mahesh Babu DJ Beauty, Pooja Hegde Comment Mahesh Babu

Mahesh Babu 25th Movie Actress Confirmed. But, Pooja Hegde not yet reveal her acceptance.

మహేష్ మూవీలో డీజే బ్యూటీ.. నో క్లారిటీ...

Posted: 06/19/2017 12:27 PM IST
Pooja hegde not yet confirmed mahesh movie

టాలీవుడ్ ను లైట్ తీస్కున్నట్లు కామెంట్లు చేసినప్పటికీ అదృష్టం బాగుండి ముకుంద తర్వాత మూడేళ్లకి డీజే(దువ్వాడ జగన్నాథమ్) రూపంలో పూజా హెగ్డేకి మరో ఛాన్స్ దక్కింది. కోలీవుడ్, బాలీవుడ్ కలిసి రాకపోవటం, తెలుగులో కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడే సెటిల్ అయిపోదామని భావిస్తోంది. పైగా ఇప్పుడున్న హీరోయిన్లు బోర్ కొడుతుండటం, స్టార్ల పక్కన ప్రెష్ కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకోటం పూజాకి కలిసొచ్చే అంశాలు.

ఈ నేపథ్యంలో మహేష్ కొత్త మూవీలో పూజా హెగ్డేనే ఫైనలైజ్ చేశారన్న ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను ఫైనలైజ్ చేశారంటూ కథనాలు వెలువడ్డాయి.దీనిపై దువ్వాడ ప్రమోషన్ లో పాల్గొంటున్న పూజాకి ప్రశ్న ఎదురైంది.

సారీ.. తాను ఈ టైంలో ఆ సినిమా గురించి ఏం చెప్పను. ఎలాంటి కామెంట్ చేయను... సింపుల్ బదులిచ్చింది. దీంతో ఆమె అసలు ప్రాజెక్టులో ఉందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోటి డిమాండ్ చేస్తుందంటూ పూజా పై పుకార్లు వస్తున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ దగ్గరే మహేష్ మూవీ కి ఇంకా ఫైనలైజ్ కాలేకపోయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Vamsi Paidipally  Pooja Hegde  25th Movie  

Other Articles