Rana entertain with stylish TV Show

Rana tv debut surprise elements

Daggubati Rana, Daggubati Rana TV Show, Daggubati Rana No 1 Yaari, No 1 Yaari TV Show, No 1 Yaari Episodes, ana Stylish TV Debut, Rana TV Show, Rana Small Screen Debut

Daggubati Rana No 1 Yaari TV Show Surprise Elements. First Episode Guests Naga Chaitanya and Sumanth.

రానా షో.. కాస్త సర్ ప్రైజింగ్ గానే...

Posted: 06/17/2017 03:34 PM IST
Rana tv debut surprise elements

తెలుగు టీవీ షోలో యాంక‌ర్‌గా త్వ‌ర‌లోనే న‌టుడు రానా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. జెమిని టీవీలో త్వ‌ర‌లోనే ‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ అనే ప్రోగ్రాం ప్రారంభం కానుంది. సెలబ్రిటీల మనోగతం మీద జరగనున్న ఈ షో ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచేసుకోవాలని భళ్లాలుడు భావిస్తున్నాడు. అందుకే ఇప్పటిదాకా ఇలా వచ్చిన టీవీ షోల కంటే భిన్నంగా చేస్తూ ఆకట్టుకుంటాడంట.

ఇక ఈ షో మొదటి ఎపిసోడ్ లోనే సర్ ప్రైజింగ్ గెస్ట్ లతో రానా రాబోతున్నాడంట. అక్కినేని హీరోలు నాగ‌చైత‌న్య‌, సుమంత్‌లు ఫస్ట్ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను సుమంత్ తన ట్విట్టర్ లో షేర్ చేసేశాడు కూడా. బావ నాగ చైతన్య, సుమంత్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. యాంక‌ర్‌గా రానాలోని కొత్తకోణం కూడా అద్భుతంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సుమంత్ అన్నాడు. ఆ ట్వీట్‌పై స్పందించిన రానా థ్యాంక్స్ సుమంత్ అన్న అని పేర్కొన్నాడు.

షోకి సంబంధించి రానా మేకోవర్ కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంది కూడా. ప్రస్తుతం తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతోపాటు కన్నడలో రాజీవ్ గాంధీ హత్యపై తీయబోతున్న సినిమాలో కూడా రానా హీరోగా నటించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : No 1 Yaari  Daggubati Rana  TV Show  

Other Articles