Allu Arjun Na Peru Surya Na Illu India starts

Allu arjun s next launched

Allu Arjun, Allu Arjun New Movie, Allu Arjun Naa Peru Surya, Naa Peru Surya Actress, Naa Peru Surya Launch Photos, Naa Peru Surya Naa Illu India launch, Bunny New Movie Launch, Naa Peru Surya Naa Illu India Producers, Naa Peru Surya Naa Illu India Actress, Naa Peru Surya Naa Illu India Director, DIrector Vakkantham Vamsi, Bunny Next Launch, Naa Peru Surya Naa Illu India Launch Celebrities

Allu Arjun's new film Naa Peru Surya Naa Illu India launched. The film will be directed by Vakkantham Vamsi and stars Rashmika Mandanna, Sarathkumar among others in lead roles.

బన్నీ నా పేరు సూర్య... లాంఛ్ అయ్యింది

Posted: 06/14/2017 11:34 AM IST
Allu arjun s next launched

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించేశాడు. రైటర్ వక్కంతం వంశీ డైరక్టర్ డెబ్యూ చేస్తున్న చిత్రం హైదరాబాద్ లో కాసేపటి క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు నా పేరు సూర్య.. అన్న టైటిల్ నే కన్ఫర్మ్ చేసేశారు. నా ఇల్లు ఇండియా అన్నది ట్యాగ్ లైన్.

మూవీ లాంఛ్ ఫోటోలు

ఇంతకు ముందు టైటిల్ మారబోతుందని చెప్పుకున్నప్పటికీ, లోగోతో సహా టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ దంపతులు హాజరుకాగా, అర్జున్ తల్లి నిర్మల క్లాప్ ఇచ్చింది. రైటర్ గా రేసు గుర్రం, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన వక్కంతం వంశీ దేశ భక్తి నేపథ్యంలో ఈ కథను అందించినట్లు తెలుస్తోంది. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.

కన్నడ బ్యూటీ రష్మీక హీరోయిన్ గా కన్ఫర్మ్ కాగా, శరత్ కుమార్ ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ తోపాటు చాలా కాలం తర్వాత మెగా బ్రదర్ నాగేంద్ర బాబు నిర్మాతగా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ విశాల్ శేఖర్ మ్యూజిక్ సమకూర్చబోతున్నారు.  ప్రస్తుతం బన్నీ డీజే ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఆ హడావుడి ముగిశాక రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. వచ్చే సమ్మర్ లో నా పేరు సూర్య రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Naa Peru Surya Naa Illu India  Launch Photos  

Other Articles