Veteran Actress Tortured and Abandoned in Hospital

Pakeezah actor geeta kapoor abandoned by children

Pakeezah Actor, Geeta Kapoor Sad Story, Geeta Kapoor Hospital, Geetha Kapoor Interview, Geetha Kapoor Son Torture, Veteran Actress Sad Story, Bollywood Pakeezah Geeta Kapoor, Geetha Kapoor Hospitalized, Ramesh Taurani Ashok Geetha Kapoor

Pakeezah actor Geeta Kapoor abandoned by son in hospital, she claims he tortured her. Producers help this Veteran Actress.

వెటరన్ నటికి కొడుకు టార్చర్.. ఆపై అనాథలో ఆస్పత్రిలో వదిలేశాడు

Posted: 05/30/2017 01:10 PM IST
Pakeezah actor geeta kapoor abandoned by children

సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్.. బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరాన్జీ ముంబైలో ఓ పెద్దావిడను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన వార్త మీడియాలో నిన్నంతా వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఎవరా? అని దగ్గరగా వెళ్లి చూసిన మీడియాకు పెద్ద షాకే కొట్టింది. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా చెలామణి అయిన నటి గీతా కపూర్.

పాకీజా చిత్రంతో పాపులర్ అయిన గీతా కపూర్ తర్వాత రజియా సుల్తానా, మరో డజను పైగా సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో మెప్పించింది. గత నెల 21న రక్తపోటుతో బాధపడుతున్న ఆమెను కొడుకు రాజాకుమార్ ఆస్పత్రిలో చేర్పించాడు. డబ్బులు తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లి, అప్పటి నుంచి తిరిగి రాలేదు. అయితే ఆమె నేపథ్యం, దీనస్థితికి జాలిపడ్డ ఆసుపత్రి వైద్యులు మాత్రం వైద్యం కొనసాగిస్తున్నారు. తర్వాత పోలీసుల సాయంతో ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేయత్నం చేయగా, కొడుకు పత్తా లేకపోవటం, కూతురు రాంగ్ నంబర్ అంటూ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

చివరకు ఆమె దీన స్థితి గురించి పేపర్ కథనం ద్వారా తెలుసుకున్న అశోక్, రమేష్ లు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. లక్షన్నర ఆస్పత్రి బిల్లును చెల్లించటంతోపాటు చికిత్స మరింత కాలం కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇక కొడుకు తనపై ఎంతో నిర్దయగా ప్రవర్తిస్తుండే వాడని, ఓ గదిలో బంధించి, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవాడని ఆమె రోదిస్తూ చెబుతోంది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakeezah Movie  Geeta Kapoor  Sad Story  

Other Articles