Pawan Recommend Flop Director to Mega Hero

Sai dharam tej movie with karunakaran

Karunakaran Mega Hero, Mega Hero Flop Director, Sai Dharam Tej Karunakaran, Sai Dharam Tej Loce Story, Pawan Recommend Mega Hero, Pawan kalyan Karunakaran, Karunakaran New Movie, Sai Dharam Tej New Movie

Karunakaran finnaly got mega hero chance after huge lobbying. After Pawan Recommendation Sai Dharam Tej accept movie with this flop director.

కరుణాకరన్ దర్శకత్వంలో సాయి.. పవన్ రికమండేషనా?

Posted: 05/24/2017 11:06 AM IST
Sai dharam tej movie with karunakaran

టాలీవుడ్ యంగ్ స్టర్లలో కాంపిటీషన్ నానాటికీ పెరిగిపోతుంది. స్టార్ హీరో రేసులోకి ఎంటర్ కావాలంటే తప్పకుండా వరుస హిట్లతో దూసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాని, నిఖిల్, శర్వానంద్, ఇలా ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోలు లీడ్ లో ఉండగా, మెగా యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు మాత్రం వరుస ఫ్లాపులతో వెనకబడిపోయారు.

వీరిలో సాయి ధరమ్ తేజ్ ది స్పెషల్ సిచ్యుయేషన్. వరుసగా సక్సెస్ టేస్ట్ చేసిన ఈ మాస్ హీరోకి తిక్క, విన్నర్ లు కోలుకోలేని దెబ్బ వేశాయి. ఏ చిన్న అంశం పరంగా కూడా ఆకట్టుకోలేకపోయిన ఈ రెండు సినిమాలు సాయి ఇమేజ్ ను మరింత దిగజార్చాయి. ఇలాంటి టైంలో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మెగా మెనల్లుడు తీసుకున్న ఓ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం జవాన్ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సాయి తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చేశాడంట. తొలిప్రేమ దర్శకుడు కరుణాకరణ్ తో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీలో సాయి నటించబోతున్నాడని తెలుస్తోంది. కరుణాకరన్ కి హిట్ కి గ్యాప్ వచ్చి చాలా ఏళ్లే అయ్యింది. అయినప్పటికీ స్వయంగా మావయ్య పవనే రికమండ్ చేయటంతో స్టోరీ విన్న సాయి కథ నచ్చి కమిట్ అయినట్లు సమాచారం.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Kaunakaran  Pawan kalyan  

Other Articles