Chiranjeevi Secret Visit Rajamouli's House

Chiru visits rajamouli s home

Chiranjeevi Rajamouli, Chiru Rajamouli, Chiru Baahubali 2, Chiranjeevi Trivikram Rajamouli, Rajamouli Chiranjeevi, Chiru Secret Meet, Chiru Secret Meet Rajamouli, Rajamouli Chiranjeevi Movie, Khaidi meets Baahubali Director, Megastar Rajamouli

Megastar Chiranjeevi visit Baahubali Director Rajamouli's House. Chiru Congratulate him on Baahubali 2 Huge Success.

జక్కన్న ఇంటికి వెళ్లొచ్చిన మెగాస్టార్

Posted: 05/23/2017 12:50 PM IST
Chiru visits rajamouli s home

బాహుబలి రెండు పార్ట్ ల విజయం తర్వాత రాజమౌళి స్థాయి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దగ్గర ఉన్న వనరులను సరిగ్గా వాడుకుంటే హాలీవుడ్ స్థాయిలో ఓ సినిమాను తీయొచ్చనే జక్కన నిరూపించాడని వోల్ కంట్రీ కోడై కూస్తోంది. 1500 కోట్ల ఫస్ట్ ఇండియన్ సినిమాపై అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపించేస్తూ ప్రత్యేక కథనాలు రాసేసింది. ఈ దశలో రాజమౌళి ఇంటికి ఓ స్పెషల్ గెస్ట్ రావటం వార్తగా మారింది.

అది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. బాహుబలి ది కంక్లూజన్ సినిమాను ప్రేక్షకుల మధ్యే చెర్రీతో కలిసి సైలెంట్ గా చూసేసిన చిరు ఫోటోలు బయటికి రావటం తెలిసిందే. ఆ సమయంలో రాజమౌళి లండన్ టూర్ లో చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్నాడు. ఆపై ఫ్యామిలీతో వెకేషన్ గడిపి ఈ మధ్యే తిరిగి వచ్చాడు. అందుకే చిరు స్వయంగా రాజమౌళి ఇంటికి వెళ్లి ప్రశంసించి వచ్చాడంట.

కొన్నాళ్ల క్రితం మెగా హీరోలతో ఎట్టి పరిస్థితుల్లో సినిమాలు చేయబోనని రాజమౌళి చెప్పినట్లు ఓ పుకారు రేగింది. దానిపై ఎవరి తరపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సినిమా రిలీజ్ అయ్యాక చరణ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ, చివర్లో పవన్ ఇలా మెగా హీరోలంతా బాహుబలిపై ప్రశంసలు కురిపిస్తే.. చిరు ఏకంగా ఇలా జక్కన్న ఇంటికి వెళ్లి అభినందించి రావటంతో వీరి కాంబోలో సినిమా ఫ్యూఛర్ లో అయినా కన్ఫర్మ్ అనే మెగా ఫ్యాన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే మరీ ఇంత సీక్రెట్ గా కలుసుకోవాల్సిన అవసరం ఏంటన్నది ఇప్పుడు మొదలైన అసలు ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Rajamouli  Secret Meet  

Other Articles