Rajinikanth Just Hint at Joining Politics

Rajinikanth speech at fans darshan

Rajinikanth, Superstar Rajinikanth, Rajinikanth Meet Fans, Rajinikanth Fans Darshan, God will Rajinikanth, Left to God Rajinikanth, Rajinikanth Wrong People, Rajinikanth DMK-TMC Alliance Apology, Rajinikanth Party Symbol, Rajinikanth Baba Symbol, Rajinikanth Hints Politics, Rajinikanth New Party

Superstar Rajinikanth Meet Fans After long gap. Leaves Door Open on Joining Politics.Will join politics if God wills but not with Wrong People.

దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తా - రజనీకాంత్

Posted: 05/15/2017 12:05 PM IST
Rajinikanth speech at fans darshan

ఎనిమిదేళ్ల అభిమానుల నిరీక్షణ ఫలించింది. తమిళ తంబీల తలైవా, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్దిసేపటి క్రితం అభిమానులతో భేటీ అయ్యాడు. చెన్నై రాఘవేంద్ర కల్యాణ మండపంలో తమ అభిమాన నటుడికి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. బాబా చిత్రంలో రజనీ చూపించే తనదైన ముద్రను చూపుతూ అభిమానులు కోలాహలం చేశారు. నల్లటి దుస్తుల్లో వేదిక నెక్కిన ఆయన వెంట సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఒక్కరే ఉన్నాడు.

అభిమానులే రజనీకి ఉన్న అపారమైన బలమని వ్యాఖ్యానించారు. రజనీలో ఉన్న నిబద్ధతను తాను మరే నటుడిలోనూ చూడలేదని, అదే నిబద్ధత అభిమానుల్లోనూ కనిపిస్తోందని రజనీతో 30 సినిమాలు తీసిన ముత్తురామన్ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని, రేపు దేవుడు తనకు ఏం పని అప్పగిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాజకీయాలపై నర్మ గర్భ వ్యాఖ్యలు చేశాడు రజనీ.

అయితే వెంటనే రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పిన ఆయన, తప్పుడు వ్యక్తులను దూరంగా ఉంటానని అన్నారు. తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే పదివేలని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇక లంక పర్యటన వాయిదాపై స్పందిస్తూ పలువురు తమిళ ప్రజలతో పాటు, అభిమానులతో చర్చించిన తరువాతనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

పొలిటికల్ మద్ధతు ఎవరికంటే...

తమిళ రాజకీయాల్లో తానెప్పుడూ పాలుపంచుకో లేదని, ఎన్నడూ ఏ పార్టీకీ మద్దతివ్వలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించాడు. అన్ని రాజకీయ పార్టీలు సమయానుసారం తన పేరును వాడుకున్నాయని ఆరోపించారు. ఇకపై అలా జరగనివ్వబోనని చెప్పారు. గతంలో డీఎంకే-టీఎంసీ కూటమికి మద్ధతుగా వ్యాఖ్యలు చేసి వారికి పరోక్షంగా మద్ధతు ఇచ్చినందుకు క్షమాపణలు కోరాడు. కొన్ని పార్టీలు తన పేరును వాడుకుంటుంటే అభిమానుల్లో సైతం పలుమార్లు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో సందిగ్ధత ఏర్పడిందని తెలిపారు. అభిమానులు మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రజనీ సూచించాడు.

ఎలాంటి సమస్య ప్రజలకు ఎదురైనా, దాన్ని తీర్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు డబ్బు అక్కర్లేదని, మీలో ఉన్న నిబద్ధత, అంకితభావమే చాలని రజనీ చెప్పినప్పుడు అభిమానుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన రజనీ, తనపై చూపిస్తున్న ఇంతటి ఆదరణను జీవితాంతమూ మరచిపోబోనని చెప్పాడు. అభిమానులతో సరదాగా గడపనున్న రజనీ, వచ్చిన వారందరితోనూ ఫోటోలు దిగనున్నారు. ఎంపిక చేసిన అభిమాన సంఘాల నాయకులతో తలైవా రజనీకాంత్ సమావేశం ఉత్సాహంగా సాగుతోంది.

రాజకీయాల్లోకి వస్తే మాత్రం...

తాను రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలం నుంచి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, వారు అలా కోరడంలో తప్పులేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్నవారిని దగ్గర చేర్చుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడేది లేదని అన్నారు. భయం అన్నది తనలో, తన అభిమానుల్లో ఏ మాత్రం కనిపించదని చెప్పారు. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన చెప్పకపోయినా, రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదలు కావటం సంకేతాలుగా పలువురు భావిస్తున్నారు. ఫ్యాన్స్ ను ఎవరికీ మద్ధతు ఇవ్వొద్దన్న వ్యాఖ్యల నేపథ్యంలో దాదాపు కొత్త పార్టీ ఖాయమైనట్లేనని, ఒకవేళ పార్టీ గనుక పెడితే మాత్రం బాబా సినిమాలోని చేతి గుర్తు సింబల్ గా మారే అవకాశం ఉంటుందని అప్పుడే విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Meet Fans  Politics  

Other Articles