Sruthi Hariharan Files Plaint over Morphed Photos

Kannada actor files complaint after her morphed photos

Sruthi Hariharan, Kannada Actress Sruthi Hariharan, Sruthi Hariharan Fake Photos, Sruthi Hariharan Morphed Photos, South Actress Morph Photos, Kannada Heroine Morphing Photos, Sruthi Hariharan Complaint, Actress Fake Photos Cyber Complaint, Heroine Fake Photos Complaint, Sandalwood Sruthi Hariharan Photos

Kannada Actress Sruthi Hariharan files complaint after her Morphed Photos go Viral.

మార్ఫింగ్ ఫోటోలపై శృతి పోలీస్ కంప్లైంట్

Posted: 05/13/2017 11:20 AM IST
Kannada actor files complaint after her morphed photos

మార్ఫింగ్ జాడ్యం నానాటికీ పెరిగిపోతున్న క్రమంలో కొందరు హీరోయిన్లు స్పందించి ఎదురు నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం లైట్ తీస్కుంటున్నారు. కాస్త పేరున్న సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఫేక్ ఫోటోలు అప్ లోడ్ చేయటం వాటి గురించి వెబ్ సైట్లు కథనాలు రాసేయటం. ఆపై నావికావంటూ బాధితులు వాటిపై వివరణ ఇచ్చుకోవటం ఈ మధ్య ఎక్కువైపోయింది.

తాజాగా కన్నడ సినీ నటి శృతి హరిహరన్ కి సంబంధించిన బూతు ఫోటోలు ఇంటర్నెట్లో రిలీజ్ అయ్యాయి. లూసియా చిత్రంతో గుర్తింపు పొందిన శృతి తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కూడా నటించింది. ఇక అది తన ఒరిజనల్ ఫోటోలు కావని, తన ఫొటోను మరో చిత్రానికి అతికించి అసభ్యంగా తయారు చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో పాటు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆమె... సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు ఇచ్చింది.

తన ఫొటోను మార్పింగ్ చేసి, తన గౌరవానికి భంగం కలిగించేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరింది. దుండగుల చర్యతో తాను మానసిక వేదనను అనుభవిస్తున్నానని చెబుతోంది. గతంలో తమన్నా ఫేక్ న్యూడ్ ఫోటోలపై ఇలా సైబర్ ఫిర్యాదు చేయగా, వాటికి అడ్డుకట్ట పడకపోవటంతో సైలెంట్ గా ఉండిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada Actress  Sruthi Hariharan  Fake Photos Viral  

Other Articles