Finally Pawan kalyan respond on Baahubali 2 Success

Power star congratulates baahubali team

Pawan kalyan, Pawan kalyan Baahubali 2 Success, Baahubali 2 Pawan Kalyan, Pawan kalyam Tweets, Pawan Kalyan Congratulate Prabhas, Pawan Tweet Prabhas Fans, Pawan Tweet on Prabhas, Pawan Congratulate Rajamouli, Pawan Baahubali 2 1000 Crores Collection, Mahesh Pawan Baahubali-2 1000 Crores Collections, Baahubali 2 Collections, Pawan kalyan Rajamouli Tweets

Pawan Kalyan to open up on Baahubali 2 Huge Success. Congratulate Rajamolui, Prabhas and entire team in twitter.

బాహుబలి-2 టీంకు పవన్ కంగ్రాట్స్

Posted: 05/08/2017 11:48 AM IST
Power star congratulates baahubali team

ప్రపంచం మొత్తం ఆకాశానికెత్తుస్తున్న బాహుబలి-2 విషయంలో పవన్ మాట వరసకైనా ప్రస్తావన తేకపోవటం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. రాజమౌళి పవన్ సినిమా విషయంలో మాట తప్పటం, వెస్ట్ గోదావరి జిల్లాలో యంగ్ రెబల్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు తదితర అంశాల నేపథ్యంలోనే ఆ పని చేయటం లేదనే విమర్శలు వినిపించాయి. మరో అగ్రహీరోగా ఉన్న మహేష్ బాబు ఈ విషయంలో రియాక్ట్ కావటంతో పవన్ కు ఏమైంది అన్న హెడ్డింగులతో కొందరు ఊదరగొట్టేశారు.

అయితే వెయ్యి కోట్ల క్లబ్ లో బాహుబలి ది కంక్లూజన్ జాయిన్ అయిన సందర్భంగా ఎట్టకేలకు పవన్‌కళ్యాణ్‌ స్పందించాడు. రాజమౌళి, ఇలాంటి మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా 'శ్రీ రాజమౌళి', 'శ్రీ ప్రభాస్‌' ‘శ్రీ రానా’ అంటూ పవన్‌కళ్యాణ్‌ ప్రస్తావించడం గమనార్హం. ఎలాగైతేనేం, పది రోజుల తర్వాతైనా పవన్‌కళ్యాణ్‌ స్పందించాడని హ్యాపీగా ఫీలవుతున్నారు. 

అన్నట్టు, మొన్నీమధ్యనే 'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్‌, 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాలోని ఇంటర్వెల్‌ సీన్‌ని, 'పవనిజం' స్ఫూర్తితో రాశానని చెప్పిన విషయం విదితమే. ఇక ఇప్పుడు పవన్ ప్రభాస్ ను స్వయంగా ప్రభాస్ ను అభినందిస్తూ ట్వీట్ చేయటంతో ఇప్పటిదాకా రాద్ధాంతం చేస్తూ వస్తున్న ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  1000 Crores Club  Pawan Kalyan Tweets  

Other Articles