Ram Charan New Pet Introduced by Upasana

Meet mr c new pet

Upasana, Ram Charan, Ram Charan New Pet, Ram Charan Little Guest, Little Pet Ram Charan, ram Charan Chicken, Ram Charan Crook, Warm Villagers, Ram Charan Pet Love, Ram Charan Cock, Upasana Instagram Ram Charan, Ram Charan Special Pet, Ram Charan Villagers Gift, Mega Compound Guest

Upasana Introduce Ram Charan's New Pet.Chanran has been gifted with a rooster by what his wife Upassana Kamineni has describes as "warm villagers"

రాంచరణ్ కొత్త కోడిపుంజు

Posted: 05/06/2017 12:11 PM IST
Meet mr c new pet

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు మూగ జీవాల పట్ల ప్రేమ మాములుగా ఉండదు. అందుకే భార్య ఉపాసన కూడా కానుకగా కూడా వాటినే అందిస్తుంటుంది. చెర్రీ కాంపౌండ్ లో గుర్రాలు, కుక్కలు ఇలా చాలానే ఉంటాయి. టైం దొరికితే చాలూ వాటి ఆలనా పాలనా చెర్రీ స్వయంగా చూస్తుంటాడు.

ఇక ఇప్పుడు ఓ కొత్త గెస్ట్ కూడా వాళ్ల ఇంట్లోకి వచ్చేసింది. ప్రస్తుతం రాంచరణ్ సుకుమార్ సినిమాలో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. కోల్లేరు సమీపంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం మాగ్జిమమ్ అక్కడే సమయం గడుపుతున్నాడు. మెగా తనయుడు కావటంతో అక్కడి గ్రామ ప్రజలు చెర్రీని బాగా రిసీవ్ చేసుకుంటున్నారంట. అందుకే ఓ కోడిపెట్టను రాంచరణ్ కు బహుమతిగా ఇచ్చేశారు.

దానిని భద్రంగా తెచ్చి ఇంట్లో పెంచేసుకున్నాడు. ఆ ఇద్దరి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన తన భర్త మిస్టర్ సీ... సినిమా క్యారెక్టర్ లో లీనమైపోయాడని చెబుతూ ఆ ఫోటోను ఉంచింది. ఇక భర్తను విడిచి ఉండలేని ఉప్పీ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో సందడి చేస్తోంది కూడా. మొత్తానికి సుక్కూ సినిమా అయిపోయేలోపు చెర్రీకి మంచి ఎక్స్ పీరియన్స్ లు ఇంకా అందేలా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  New Pet  Upasana  

Other Articles