Baahubali The Conclusion Six Days Collections

Baahubali 2 6 days collections

Baahubali 2, Baahubali 2 PK Dangal, Baahubali 2 SIx Days Collections, Baahubali The Conclusion, Baahubali 2 6 Days, Baahubali 2 Highest Grosser, Baahubali 2 Indian Records, Baahubali 2 Collections

Baahubali 2 Six Days Collections. Creates history by amassing Rs 792 crore. Beats PK, Dangal Life Time Collections Highest Grosser.

బాహుబలి-2 .. ఆరు రోజుల కలెక్షన్లు

Posted: 05/04/2017 03:54 PM IST
Baahubali 2 6 days collections

అనుకున్నదే జరిగింది. రాజమౌళి బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ చరిత్రను తిరగరాసేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో బాహుబలి ది కంక్లూజన్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆరు రోజులు కేవలం 6 రోజుల్లో 792 కోట్లతో(టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం) వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఉన్న పీకే(750 కోట్లు), దంగల్ (712) కోట్ల రికార్డును ఒకే రోజులో చెరిపివేసింది.

మొత్తం కలెక్షన్లలో సుమారు 630 కోట్లు ఇండియాలో వసూలు చేయగా, ఓవర్సీస్ నుంచి 150 కోట్లు రాబట్టింది. తెలుగు వర్షన్ విషయానికొస్తే రెండు రాష్ట్రాల్లో 110 కోట్లు దాకా రాబట్టగా, ఒక్క హిందీ వర్షనే 375 కోట్లు, మిగతా భాషలన్నీ కలిపి మరో 130 కోట్లు వసూలు చేసింది. వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో కలెక్షన్లు కాస్త డల్ అయినప్పటికీ వీకెండ్ లో మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంది.

మరో నాలుగు రోజుల్లో సెకండ్ వీకెండ్ లోనే 1000 కోట్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యలో వచ్చే చిన్న సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా, లాంగ్ రన్ నడిచినా ఆ ఫిగర్ ఎక్కడ ఉంటుందో అంచనా వేయటం కష్టమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  6 Days Collections  

Other Articles