Brahmaji tweet about his son divorce | బ్రహ్మాజీ కొడుకు విడాకులు.. అసలేం జరిగింది?

Brahmaji tweet on son s divorce

Brahmaji, Brahmaji Son, Brahmaji Son Divorce, Brahmaji Son Sanjay, Brahmaji Son Wife, Brahmaji Family, Actor Brahmaji Twitter, Brahmaji Sad Tweet, Brahmaji, Sanjay and Indrakshi, Sanjay Indrakshi Divorce

Tollywood senior actor Brahmaji tweeted on his son Sanjay's Divorce. Sad to inform that my son Sanjay and his wife Indrakshi now separated fr 5 months are getting divorced .wish them happiness and better luck.

కొడుకు విడాకులపై బ్రహ్మాజీ ట్వీట్

Posted: 04/22/2017 03:33 PM IST
Brahmaji tweet on son s divorce

సెలబ్రిటీలు సాధారణంగా తమ ఇంట్లోని వ్యవహారాలను చెప్పుకోవటానికి అస్సలు ఇష్టపడరు. కానీ, సీనియర్ నటుడు బ్రహ్మాజీ వ్యవహార శైలి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం తన కుమారుడి విడాకుల విషయం గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేయటమే..

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ ఉంటాడు. కానీ రీసెంట్ గా తన కొడుకు వైవాహిక బంధం తెగిపోయిందని బాధగా ఉంది అంటూ ట్వీటాడు. నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడి విడిగా ఉంటున్నారు. త్వరలోనే వాళ్ళు విడాకులు కూడా తీసుకోవాలనుకుంటున్నారు. వారిద్దరు హ్యపీగా ఉండాలని, భవిష్యత్ బంగారంలా ఉండాలని విష్ చేయండంటూ తెలిపాడు.

సంజయ్ భార్య ఇంద్రాక్షి బెంగాల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్. 2013లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే... ఏమైందో ఏమో కానీ నాలుగేళ్లలోనే ఇద్దరూ విడిపోతున్నారు. అయిదు నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కాగా కలపడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదని తెలుస్తోంది. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటా అని గుసగుసలాడుకుంటున్నారు.

కాగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఇంతకు ముందు ఓసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులతో గొడవకు దిగి వార్తల్లో నిలిచాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Brahmaji  Sanjay  Divorce  

Other Articles