భళా జక్కన్న..సీక్రెట్ సెన్సార్ తోనే సగం సక్సెస్ | Baahubali 2 censor Details not revealed.

Baahubali 2 censor report more secrecy

Baahubali 2, Baahubali 2 Censor Details, Baahubali 2 Censor Secret, Rajamouli Censor Details, Baahubali the Concludion Details, Rajamouli Maintaining Secret, Rajamouli Kattappa Secret, April 28 Baahubali 2 Secret, Baahubali 2 Half Success

Huge appreciations on Rajamouli for Successful In Maintaining Secret after Baahubali 2's censor over.

బాహుబలి-2.. సెన్సార్ తోపాటు ఆ సీక్రెట్ కూడా?

Posted: 04/19/2017 01:45 PM IST
Baahubali 2 censor report more secrecy

బాహుబలి విషయంలో జక్కన్నను పొగడలేకుండా ఉండలేకపోతున్నాం. సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చెప్పుకుంటున్న బాహుబలి-2 విషయంలో ఎంత గోప్యతను ప్రదర్శిస్తున్నాడంటే... అందులోని అసలు ట్విస్ట్ అదేనండీ వై కట్టప్ప కిల్ బాహుబలి అన్న ప్రశ్నకు చిన్న హింట్ కూడా లీక్ కాకుండా చాలా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు.

నిజానికి బాహుబలి-2 సెన్సార్ అయ్యిందన్న విషయంపై ఎక్కడా అఫీషియల్ ప్రకటన లేదు. రన్నింగ్ టైం కూడా రెండు గంటల 45 నిమిషాలు అన్నది కొన్ని మీడియా సంస్థలు రాసిన కథనాలే తప్ప క్లారిటీ లేదు. ఒకవేళ అదే నిజమైనప్పటికీ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఫీడ్ బ్యాక్ బయటికి రావాల్సి ఉండాలి. గతంలో పెద్ద పెద్ద చిత్రాలకు అది ఏదో రకంగా బయటకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి.

కానీ, బాహుబలి ది కంక్లూజన్ విషయంలో మాత్రం అది అస్సలు జరగటం లేదు. ఫస్ట్ పార్ట్ సెన్సార్ సమయంలో వార్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్ పై ప్రశంసలు ఓపెన్ గానే కురిపించిన బోర్డు సభ్యులు కూడా ఈసారి సైలెంట్ గా ఉండిపోయారు. ఇన్నర్ వర్గాల నుంచి లీక్ లు అవుతున్న ఈరోజుల్లో, టాప్ సీక్రెట్ ను అలాగే ఉంచేందుకు రాజమౌళి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుండో అర్థం చేసుకోవాలి. మిగతా భాషల్లో కూడా సెన్సార్ అయ్యాక ఒకేసారి రన్నింగ్ టైం తదితర విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.

కానీ, ఆ సస్పెన్స్ ను మాత్రం ఫస్ట్ డే థియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడు తెరపై మాత్రమే చూడాలి అన్న పాయింట్ మీదే రాజమౌళి కాంసంట్రేషన్ చేస్తున్నాడు. బహుశా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇలా చేయటం ఇదే ప్రథమం కావొచ్చు.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Censor Details  Rajamouli  

Other Articles