తప్పతాగిన సెక్యూరిటీ గార్డు.. పక్క సీట్లో అలియా.. ఎలా తప్పించుకుంది... | Young Heroine Alia Bhatt with Drunken Man.

Alia bhatt had to deal with a drunk man at mid night

Actress Alia Bhatt, Alia Bhatt Drunk Man, Alia Bhatt Security Guard, Alia Bhatt Stuck Alone, Heroine Security Drunk, Alia Bhatt Mid Night, Alia Bhatt Bad Experience, Alia Bhatt Scary Moments

Actress Alia Bhatt stuck alone with drunk security guard at 3 in the night.

అలియాకు అర్థరాత్రి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్

Posted: 04/18/2017 03:43 PM IST
Alia bhatt had to deal with a drunk man at mid night

సాధారణంగా సెలబ్రిటీలు బయటికి వెళ్లిన సమయంలో తమ రక్షణ కోసం బౌన్సర్లను నియమించుకోవటం సహజం. షాప్ ల ఓపెనింగ్స్ కు వెళ్లినప్పుడు, అభిమానులు గుమిగూడినప్పుడు హీరోయిన్లకు ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా భారీగానే జీతాలిచ్చి వారిని నియమించుకుంటారు. ఈ విషయంలో హీరోయిన్ల పేరెంట్స్ కూడా చాలా కేర్ తీసుకుంటుంటారు. అయితే బాలీవుడ్ లో ఓ యంగ్ హీరోయిన్ కు ఇప్పుడు కాపాడాల్సిన బాడీ గార్డు నుంచే బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఫేస్ కావటం వెలుగు చూసింది.

స్టార్ డాటర్ అలియా భట్ ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ మల్హోత్రా ఇంటికి వెళ్లింది. అక్కడ రాత్రి వరకు గడిపిన అలియా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ, ఆమె బాడీ గార్డు కమ్ డ్రైవర్ ఫోన్ ఎంత సేపటికి తీయకపోవటంతో అక్కడే చాలా సేపు ఆమె వేచి చూడాల్సి వచ్చింది. చివరకు అర్థరాత్రి 3 గంటల సమయంలో అతను రావటంతో అప్పుడు ఇంటికి బయలుదేరింది. అయితే మధ్యలో అతని ప్రవర్తనలో తేడా అనిపించిన అలియాకు తర్వాత అతను తాగి ఉన్నాడనే విషయం అర్థమైంది.

ఆ సమయంలో అతనితో గొడవకు దిగటం మంచిది కాదని డిసైడ్ అయిన ఆమె ఇంటికి వెళ్లేదాకా ఊపిరి బిగపట్టి సైలెంట్ గా కూర్చుందంట. చివరకు సేఫ్ గా రీచ్ అయ్యాక ఆమె తల్లి సోనీ రజ్దాకు అసలు విషయం చెప్పి ఉదయమే అతని ఉద్యోగంలోంచి తీయించి వేసింది. ఆ సమయంలో జరగరానిది ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ఆమె తల్లి దగ్గర వాపోయినట్లు ఓ బాలీవుడ్ మీడియా కథనం రాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Stuck Alone  Drunk Security Guard  

Other Articles