పీకే 25.. ఆ బాలీవుడ్ నటుడు ఉన్నాడా? లేడా? | No Bollywood actor for Pawan 25th Film.

Aadi pinishetty main villain for pawan kalyan

Aadi Pinisetty, Aadi Pinisetty Pawan kalyan, Pawan Kalyan Aadi Pinisetty, Main Villain Pawan Kalyan, Pawan Kalyan 25th Movie, PK 25, Pawan Villain, Aadi Pawan Kalyan, Sonu Sood Pawan Kalyan, Sonu Sood Aadi Pinishetty, Paradesa Prayanam Movie, Pawankalyan Paradesa Prayanam

Sonu Sood not roped in Pawan Kalyan- Trivikram movie. Kollywood young hero Aadi Pinishetty will be Pawan Kalyan's antagonist in this movie officially confirmed.

అఫీషియల్:పవన్ సినిమాలో ఆదియే విలన్

Posted: 04/17/2017 11:42 AM IST
Aadi pinishetty main villain for pawan kalyan

హిట్ కాంబో హ్యాట్రిక్ కు సిద్ధమైపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఓ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. సర్దార్, కాటమరాయుడులతో నిరాశపరిచిన పవన్ అభిమానులకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు. పొలిటికల్ కమిట్ మెంట్ లకు కాస్త గ్యాప్ ఇచ్చి ఒక్క రోజు కూడా షూటింగ్ కు మిస్ కాకుండా హాజరైపోతున్నాడు.

ఇంకో పక్క చిత్రంపై వస్తున్న రూమర్లకు యూనిట్ క్లారిటీ ఇస్తోంది. ముందుగా ఈ చిత్రంలో విలన్ పాత్రకు డైరక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు, యంగ్ హీరో ఆది పినిశెట్టిని తీసుకున్నారనే చెబుతూ వస్తున్నారు. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం ఈ మధ్య ఓ కొత్త కథనాన్ని రాసింది. సోనూ సూద్ కు ఆ ఛాన్స్ దక్కిందంటూ పేర్కొంది. త్రివిక్రమ్ అతడు, జులాయి చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ నటుడినే ఫైనల్ గా ఎంపిక చేశారంటూ తెలిపింది.

వెంటనే స్పందించిన నిర్మాతలు ఈ పుకారుపై ఓ స్టేట్ మెంట్ ను రిలీజ్ చేశారు. అదంతా ఉత్తదేనని, సరైనోడు ఫేం ఆదినే ఇందులోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడని క్లారిటీ ఇచ్చేసింది. ఇందుకోసం ఈ యంగ్ హీరోకి నిర్మాతలు భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. అన్నట్లు ఇదివరకు ఇంజనీరింగ్ బాబు అన్న టైటిల్ వినిపించగా, ఇప్పుడు పరదేశ ప్రయాణం అనే టైటిల్ చక్కర్లు కొడుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyam  Trivikram  Aadi Pinishetty  

Other Articles