మహేష్ మెగా ఫ్యామిలీ గురించి అలా చెప్పాడా? | Mahesh Babu about Mega Family relation.

Mahesh about war with ram charan fans

Mahesh Babu, Mahesh Babu Ananda Vikatan Interview, Mega Family Mahesh Babu, Mahesh Babu Ram Charan, Ram Charan and Mahesh Babu, Mahesh Babu About Politics, Mahesh Babu Chiranjeevi, Mahesh Babu SPYder Story Line, Mahesh Babu About Vijay, Mahesh Babu Latest Interview, SPYder Movie, Mahesh Spyder Interview, Mahesh Babu about Fans War, Mahesh Babu Ram Charan Fans

Mahesh Babu about closeness with Mega Family and Friendship with Ram Charan in Ananda Vikatan Interview.

ఫ్యాన్స్ వార్ గురించి మహేష్ బాబు

Posted: 04/13/2017 12:13 PM IST
Mahesh about war with ram charan fans

సౌత్ లో హీరోల ఫ్యాన్స్ వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానోక సమయంలో చంపేసుకునే స్థాయికి ఆ అభిమానం చేరటం, అది కూడా టాలీవుడ్ లోనే కావటం శోచనీయం. అయితే తామేమో ఫ్రెండ్లీ మ్యానర్ లో ముందుకు వెళ్తుంటే అభిమానులు మాత్రం ఇలా తిట్టేసుకోవటం, కొట్టేసుకోవటం సరికాదని, దయచేసి అలాంటి అభిమానం వద్దని హీరోలు మొత్తుకుంటున్నా వాళ్ల పైత్యం మాత్రం తగ్గట్లేదు.

ఇదిలా ఉంటే తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కూడా ఇలాంటి లొల్లి జరుగుతూ వస్తోంది. సినిమాలు రిలీజ్ అయిన సమయంలో సెటైర్లు వేయటం, ఫ్లాప్ అయితే సంబరాలు చేసుకోవటం ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు. అలాంటి వాళ్లకు షాకిస్తూ గత కొంత కాలంగా వాళ్లెంత మంచి స్నేహితులో పలు సందర్భాల్లో మనకు ప్రత్యక్షంగా చూపారు కూడా. శ్రీమంతుడు సమయంలో చెర్రీ మహేష్ ను అభినందించటం నుంచి మొదలుకుని హాలీడేస్ రెండు ఫ్యామిలీలు ఎంజాయ్ చేయటం, ఒకానోక దశలో ఇద్దరు బిజినెస్ పార్టనర్ లుగా కూడా మారుతారని చెప్పుకున్నారు కూడా.

ఇదిలా ఉంటే తన కొత్త సినిమా ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముందు ఆనంద వికటన్ అనే తమిళ వీక్లీ మ్యాగ్జైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు మహేష్. అందులో మెగాస్టార్ చిరంజీవి.. తనయుడు రామ్ చరణ్ ల గురించి ఆసక్తర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవితో పాటు చరణ్ తో తాను చాలా క్లోజ్ అని మహేష్ వ్యాఖ్యానించాడు. ఐతే చరణ్ తో ఎంత క్లోజ్ అయినప్పటికీ అభిమానులు మాత్రం పరస్పరం గొడవ పడుతూ ఉంటారని, బాక్సాఫీస్ రికార్డుల విషయమై సోషల్ మీడియాలో కొట్టేసుకుంటూ ఉంటారని కూడా మహేష్ చెప్పాడు.

ఇదే ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరో విజయ్ తోస్నేహం గురించి ప్రస్తావిస్తూ గతంలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో అది కుదరలేదని చెప్పటం విశేషం. రాజకీయాలపై స్పందిస్తూ తనకు ఆ ఆసక్తే లేదని తేల్చేశాడు కూడా. గజిని, తుపాకీ లైన్ల ఆధారంగానే స్పైడర్ కథను మురగదాస్ రూపొందించాడని, కోలీవుడ్ ప్రేక్షకులను ఓ స్ట్రెయిట్ సినిమాతో పలకరించటం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు సూపర్ స్టార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Ananda Vikatan  Mega Family  Ram Charan  Fans War  

Other Articles