విశాల్ మళ్లీ ఛాలెంజ్ చేసి గెలిచాడు | Vishal challenging victory in Producer council election.

Vishal wins producers council election

Tamil Nadu Film Producers Council, Producers Council Elections, Vishal Producers Council President, Vishal Panel Producers Council, VIshal Prakash Raaj Gautham Vasudev, Namma Ani Banner, Producers Council Elections 2017, Vishal Grand Victory

Major victory for Vishal in TN film producers' council elections. From Vishal’s faction, Prakashraaj and Gautham Vasudev Menon were elected vice-presidents of the council and S.R. Prabhu, who heads Dream Warrior Pictures, was elected treasurer. Vishal will now hold two posts as he is also general secretary of Nadigar Sangam or South India Artists Association. Vishal had then assembled a team with several well-known producers, including Prakashraaj, Gnanavel Raja, Mysskin, Gautham Vasudev Menon under the banner of “Namma Ani.”

నిర్మాత మండలి ఎన్నికలో విశాల్ విజయం

Posted: 04/03/2017 09:57 AM IST
Vishal wins producers council election

హీరో విశాల్ మరోసారి తన సత్తా చాటాడు. ఛాలెంజింగ్ గా తీసుకున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేశాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కొందరు  బోండాలు, బజ్జీలు తింటూ టైంపాస్ చేస్తున్నారని, మిగతా వాళ్ల సంక్షేమానికి కృషి చేయట్లేదని వ్యాఖ్యలు చేయటం, అది కాస్త పెద్ద ఇష్యూ అయ్యింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి విశాల్ పై విరుచుకుపడటం, ఆపై అతన్ని సస్పెండ్ చేయటం, మద్రాస్ హైకోర్టు జోక్యంతో మళ్లీ విశాల్ కు ఊరట లభించటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో ఏకంగా నిర్మాతల మండలిలో పోటీకి సై అనటంతో ఆసక్తి నెలకొంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికలో  పోటీగా దిగిన రాధాకృష్ణన్, కేఆర్ లపై వందకు పైగా ఓట్లతో విశాల్ విజయం సాధించాడు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాల్‌ కు 478, రాధాకృష్ణన్ కు 355, కేఆర్‌ కు 224 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండు నుంచే విశాల్‌ ముందంజలో నిలవడం గమనార్హం. విజయానంతరం విశాల్ మాట్లాడుతూ... తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు మార్పును కోరుకున్నారని, వారి మనోభావాలే తన గెలుపుగా మారాయని, ఇక తమ జట్టు అంకితభావంతో పనిచేసి, నిర్మాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. 

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ ఇప్పుడు 2017-19 సంవత్సరాలకుగాను తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కూడా కొనపాగుతాడు. ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించటం విశేషం. తమిళ సినిమాకు మరోసారి స్వర్ణయుగం తీసుకు రావడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపాడు. ఓ తెలుగు వాడు కోలీవుడ్ లో ఆధిపత్యం చెలాయించటంపై మొదట్లో కొంత మంది అక్కసు వెల్లగక్కారు. అయితే రాను రాను తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి ఇప్పుడు అంతా విశాల్ కు అండగా నిలుస్తున్నారు. మొన్నామధ్య జరిగిన నడిగర్ సంఘం భవనం శంకుస్థాపన సమయంలో వారంతా విశాల్ ను పొగటం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TN Producers Council Elections  New President  Hero Vishal Victory  

Other Articles