వెటరన్ దర్శకుడు కోడి రామకృష్ణ సినిమాలతో ఎక్కువ పాపులర్ అయిన సీనియర్ నటుడు కాస్టూమ్స్ కృష్ణ గుర్తున్నాడా? భారత్ బంద్, పెళ్లాం చెబితే వినాలి లాంటి చిత్రాల్లో ఆయన విలనిజంతో కొత్త ఒరవడిని సృష్టించిన ఆయన తర్వాత చాన్నాళ్లుగా అజ్నాతంలో ఉండిపోయాడు. ఈ మధ్యే శతమానం భవతి సినిమా వేడుకలో ఆయనకు ఘన సన్మానం చేయటం చూశాం. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన కెరీర్ లో సక్సెస్ అయ్యాడు. అయితే పెళ్లి పందిరి సినిమా సమయంలో ఆయనకు జరిగిన మోసం మాత్రం ఆయన్ని క్రమంగా సినిమాలకు దూరం చేసిందంట. అదేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెబుతున్నాడు.
జగపతి బాబు, రాశి జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో పెళ్లి పందిరి చిత్రాన్ని నిర్మించింది ఈయనే. అప్పటికే పరిచయం ఉన్న వ్యక్తి కావటంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ జగ్గూ భాయ్ ఇందులో హీరోగా నటించాడు కూడా. కేవలం 45 రోజుల్లో నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే పలువురు సెలబ్రిటీలకు ఆయన చూపించటం, వారు అది హిట్ అని చెప్పటంతో పబ్లిసిటీ కూడా అవసరం లేదని కృష్ణ డిసైడ్ అయ్యాడంట. అయితే ఈ విషయంలో జగపతి బాబు మాత్రం ఖచ్ఛితంగా పబ్లిసిటీ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో కాస్త తగ్గాడంట.
ఆ సమయంలో ఫైనాన్షియర్లు తనకు రెండు లక్షలు ఇచ్చారని, ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు తీసుకున్నారని, అదే తనని పెద్ద దెబ్బతీసిందని ఆయన చెప్పాడు. సినిమా హిట్ అయ్యాక తమిళ్ రీమేక్ కోసం 7 లక్షలకు తాను బేరం కుదుర్చున్నానని, కానీ, ఫైనాన్సియర్లు మధ్యలో కల్పించుకుని 25 లక్షలు డిమాండ్ చేయగా తాను ఇదేంటని అడిగితే.. ఆ స్టాంపు పేపర్లు చూపించి నీకు సంబంధం లేదని చెప్పటంతో తాను మోసపోయినట్లు అర్థమైందని వివరించాడు.
తనకి చదువు రాకపోవటంతోనే ఇదంతా జరిగిందని, ఇక అప్పటి నుంచి సినిమాలు నిర్మించని ఆయన తర్వాత తర్వాత మెల్లిగా సినిమాల్లో నటించటం కూడా మానేశానని చెప్పాడు. మంచి క్యారెక్టర్లు దొరికితే చేయటానికి తాను ఇప్పటికీ సిద్ధమేనని ఆయన అంటున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more