కొత్త రూల్స్... అలాంటి హీరోయిన్లకు ఇక చుక్కలే.. | Mumbai heroines trouble with New Rules.

Fefsi new rules trouble for north heroines

FEFSI New Rules, FEFSI Bollywood Actress, FEFSI Cine Workers, FEFSI Head RK Selvamani, RK Selvamani FEFSI Rules, Film Employees Federation of South India Council

Film Employees Federation of South India (FEFSI) Council New rules to other north heroines. Bans other state cine workers.

ముంబై హీరోయిన్లకు ఇక చిక్కులే!

Posted: 03/24/2017 12:19 PM IST
Fefsi new rules trouble for north heroines

టాలెంట్ ఉన్న ఎక్స్ పోజింగ్ విషయంలో వెనకబడి ఉన్నారన్న ఒకే ఒక్క సాకుతో సొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేయకపోవటం సౌత్ లో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. అయితే అందుకు మేము రెడీ అంటూ కొందరు ముందుకు వస్తున్నప్పటికీ నార్త్ భామలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడి మేకర్లు. అయితే అదే అదనుగా తీసుకుని గొంతెమ్మ కోరికలను తీర్చుకుని నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిపోతున్నారు.

అయితే ఇకపై అలాంటి వేషాలు కుదరవని హెచ్చరిస్తోంది దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ). ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే నిర్మాతలపై భారం వేయొద్దంటూ వార్నింగ్ ఇస్తోంది. ఈ మేరకు దర్శకుడు ఆర్కే సెల్వమణి అధ్యక్షతన జరిగిన భేటీలో కొత్త తీర్మానాలు చేసింది. నార్త నుంచి వచ్చే బామలు ఇకపై వారి పర్సనల్ ఖర్చులు వాళ్లే భరించాల్సి ఉంటుంది. అంతేకాదు పర్సనల్ సిబ్బందిని కూడా ఫెఫ్సీలో సభ్యత్వం ఉన్నవాళ్లనే తీసుకోవాలి కూడా.

మేకప్ ఖర్చులను పర్సనల్ ఖర్చులతో కలిపి నిర్మాత ఖాతాలో వేయటం మూలంగా సినిమా బడ్జెట్ పై ప్రభావం చూపుతుందని ఫెఫ్సీ చెబుతోంది. అంతేకాదు సిబ్బంది పేరుతో కుటుంబ సభ్యుల పేర్లను కూడా జత చేయటం, వాళ్లు సెట్లో అనవసరమైన సీన్లు క్రియేట్ చేయటం, అవి చిత్ర మండలిలో ఫిర్యాదుల దాకా వెళ్లటం తదితర పరిణామాలతో తలనొప్పిగా మారటం మూలంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FEFSI  New Rules  RK Selvamani  Cine Workers  

Other Articles