అట్టర్ ఫ్లాప్ సినిమా.. అయినా పాటకు 15 కోట్ల వ్యూవ్స్ | Ok Jaanu SOng Creates new record in youtube.

Humma humma song creates new record

OK Jannu Movie, OK Jaanu Humma Humma Song, Humma Humma Remix, OK Jaanu Youtube Record, Humma Humma 150 Million views, Most Youtube Viwed Indian Songs

Shraddha Kapoor's latest chartbuster 'Humma Humma' from OK Jaanu has crossed 150 million views on Youtube, becoming a top favourite of music lovers.nashe si chadh gayi in top place.

హమ్మా.. హమ్మా... సాంగ్ న్యూ రికార్డు

Posted: 03/18/2017 04:23 PM IST
Humma humma song creates new record

మార్చి 31 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదుగానీ, ప్రస్తుతానికైతే యూట్యూబ్ రికార్డులు వరుసగా బద్ధలు అయిపోవటం చూస్తున్నాం. కాటమరాయుడు నెల రోజుల రికార్డును కేవలం హాఫ్ డే లో బాహుబలి బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. పాటల విషయంలో కూడా ఇప్పుడు కొనసాగుతోంది. అయితే మన దగ్గరే కాదు, బాలీవుడ్ లో కూడా దీనిని కొంచెం గర్వంగానే భావిస్తున్నారు. రీసెంట్ ఓ పాట 150 మిలియన్ వ్యూవ్స్ రాబట్టి చారబస్టర్ గా ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం.

బాలీవుడ్ లో ఆదిత్యా కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా వచ్చిన 'ఓకే జాను' సినిమాలోని హమ్మా హమ్మ పాట‌ యూ ట్యూబ్ దుమ్ము దులిపేస్తోంది. ఓకే కన్మణి(తెలుగులో ఓకే బంగారం) రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో బాంబే సినిమాలో తన పాటనే రీమిక్స్ చేశాడు రెహ్మన్. ప్రమోషన్ లో భాగంగా మూడు నెలల ముందే ఈ పాటను యూ ట్యూబ్ లో రిలీజ్ చేయగా 15 కోట్ల 33 లక్షల వ్యూస్‌ను సాధించింది. ఈ సంద‌ర్భంగా సోని మ్యూజిక్ ఇండియా సంస్థ తమ ట్విట్ట‌ర్ ఖాతాలో హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

 

మరోవైపు నటి శ్రద్ధా కపూర్ కూడా ట్విట్టర్ లో హ్యాపీగా ఫీలవుతోంది. శ్రధ్ధా స్టైలిష్ స్టెప్పులు, బీట్ మ్యూజిక్ తోడ‌వడంతో ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వస్తూనే ఉంది. ఇప్పటిదాకా అయితే బేఫికర్ లోని ‘నషే సి చద్’ 20 కోట్ల 11 ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో తొలిస్థానంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OK Jaanu  Humma Humma Song  Youtube Record  

Other Articles