అనుభవం అక్కర్లేకపోయినా సరే తమ టాలెంట్ తో యువ దర్శకులు సన్సేషన్ లుగా మారిపోతున్నారు. కొత్త జోనర్ లు, పైగా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుల్లాగ తెరకెక్కించి బ్లాక్ బస్టర్లను తమ ఖాతాల్లో వేసేసుకుంటున్నారు. ఈ మధ్యే సంకల్ప్ రెడ్డి అనే తెలుగు కుర్రాడు ఘాజీ తో టోటల్ ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ యువ సంచలనం ఇప్పుడు బాలీవుడ్
వైపు అడుగులు వేయబోతున్నాడు.
గతేడాది డిసెంబర్ లో తమిళ్ లో ‘పతినారు ధ్రువంగల్’ అనే ఓ సినిమా వచ్చింది. కోలీవుడ్ తోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు రెహమాన్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పెద్ద స్టార్లు లేరు, పైగా అంతా కొత్త వాళ్లే ఆ సినిమా యూనిక్ కంటెంట్ కారణంగా క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది. ఇంతకీ ఈ క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ నారేన్ వయసు 21 ఏళ్లు మాత్రమే.
ఆ సినిమా ఈ మధ్యే టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ‘డీ 16’ పేరుతో విడుదలైన ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. గ్రిప్పింగ్ నేరేషన్ తో స్క్రీన్ ప్లే వాల్యూ ఏంటో చాటి చెప్పిన కార్తీక్ కు ఇప్పుడు బంఫరాఫర్ తగిలింది. ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈ చిత్రంలో నటించేందుకు ముందుకు రావటంతో త్వరలో ఈ చిత్రం బాలీవుడ్ కు కూడా వెళ్లనుంది. రెహమాన్ పాత్రలో సదరు స్టార్ హీరో చేస్తుండగా, మిగతా పాత్రల కోసం మాతృక లాగే అంతా కొత్త వాళ్లనే తీసుకోబోతున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more