రజనీకాంత్ ఇలాకాలోకి అమీజాక్సన్ సందడి amy jackson buys home in chennai

Amy jackson has a home in rajinikanth s hometown

Amy jackson, Rajinikanth, Kollywood, Akshay Kumar, Chennai, Tamil, Telugu, Shankar, 2.0, 2 Point 0, Besant Nagar, marguerita, Bollywood, amy jackson news

Amy Jackson is now a Chennai resident. The actress has purchased a sprawling sea-facing apartment in Chennai's Besant Nagar.

రజనీకాంత్ ఇలాకాలోకి అమీజాక్సన్ సందడి

Posted: 03/12/2017 10:14 AM IST
Amy jackson has a home in rajinikanth s hometown

నటి ఎమీజాక్సన్‌, కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలాకాలో సందడి చేస్తుందట. అదేంటి అందులో ఏం తప్పు వుంది..? అయినా ఒక్క రోజేగా అంటారా..? అదేం కాదండీ.. జాక్సన్ ఏకంగా రజనీ ఇలాకాలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ ఇంగ్లీష్‌ బ్యూటీ ఇప్పటివరకూ స్టార్‌ హోటల్‌నే బస చేస్తూవచ్చారు. మధ్యలో హిందీ చిత్రాలపై దృష్టి సారించిన ఎమీ అక్కడ సక్సెస్‌ దరిచేరకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌ను ఆశ్రయించారు.

ప్రస్తుతం సూపర్‌స్టార్‌కు జంటగా 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన ఈ భామ ఇకపై చెన్నైలోనే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారట. దీంతో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోదలచిన ఎమీ స్థానిక బీసెంట్‌ నగర్‌ సముద్రతీర ప్రాతంలో ఒక అందమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దానికి తనకు నచ్చిన విధంగా పాశ్చాత్యం సొబగులను అందించుకునే పనిలో ఉన్నారట. త్వరలోనే ఆ ఫ్లాట్‌లో మకాం పెట్టనున్న ఎమీజాక్సన్‌ తనకు తోడుగా తను తల్లి మార్గెట్‌ను తీసుకురావాలని భావిస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles