‘మా’ కొత్త కార్యవర్గం.. రాజేంద్రుడికి నచ్చలేదా? | Why Rajendra Prasad far away with new panel.

Where is maa ex president rajendra prasad

Actor Rajendra Prasad, MAA Ex President, Rajendra Prasad Shivaji Raja, Shivaji Raja MAA New Chairman, New MAA Panel Meeting

Actor Rajendra Prasad not attended to new MAA panel meeting. Doubts raised that he don't like it.

ఇంతకీ మా మాజీ రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ?

Posted: 03/08/2017 04:56 PM IST
Where is maa ex president rajendra prasad

రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మూవీ) ఎన్నికల సమయంలో రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ జయసుధ వార్ ఎంతటి రచ్చ చేసిందో తెలిసిందే. కొన్నేళ్లుగా ఏకగ్రీవంగా జరుగుతున్న సాంప్రదాయానికి చెక్ పెడుతూ ఈ రెండు వర్గాలు బాహాబాహీ విమర్శలు చేసుకున్నాయి కూడా. సీనియర్ నరేష్ లాంటి నటులైతే ఓ మెట్టు దిగజారి ఘాటు కామెంట్లు చేశారు కూడా. ఏదైతేనేం చివరకు రాజేంద్ర ప్రసాద్ తరపు ప్యానెల్ విజయం సాధించటం, ఆపై పరిస్థితులు మళ్లీ మాములుగా మారిపోవటం చూశాం.

ఇక ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అదే పద్ధతిలో మిగిలిన సభ్యుల ఎంపిక కూడా జరిగింది. అక్కడిదాకా వ్యవహారం బాగానే ఉన్నప్పటికీ ప్యానెల్ బాధ్యతలు స్వీకరించే సమయంలో ఎక్స్ అధ్యక్షుడు హాజరు కావటం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. కానీ, శివాజీరాజా పగ్గాలు చేపట్టే సమయంలో రాజేంద్ర ప్రసాద్ కనిపించకపోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

నిజానికి గత పదేళ్లలో జరిగిన డెవలప్ మెంట్ ను రాజేంద్ర ప్రసాద్ ఈ రెండేళ్లలో చేసి చూపించాడు కూడా. అందుకే ఈ దఫా కూడా ఆయనే అవుతారని అంతా భావించారు. కానీ, సభ్యుడిగా ఉన్న శివాజీ రాజా కష్టానికి ఏకగ్రీవంగా ప్రతిఫలం దక్కింది. అంతేకాదు వేణుమాధవ్ ఉపాధ్యక్షుడిగా, నరేష్ కు ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. అయితే తెర వెనుక వ్యవహారం ఏదైనప్పటికీ, మాజీ అధ్యక్షుడి హోదాలో నైనా ప్రెస్ మీట్స్ కు రాజేంద్ర ప్రసాద్ హాజరు కాకపోవటం, కనీసం శివాజీ రాజా ఎన్నికపై తన స్పందన తెలియజేయకపోవడంతో విమర్శలతోపాటు అసలు ఈ వ్యవహారమే ఆయనకు ఇష్టం లేదనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Rajendra Prasad  Shivaji Raja  New MAA President  

Other Articles