ఉమెన్స్ డే స్పెషల్.. సన్నీ పేరిట బూతు ట్వీట్... రచ్చ రచ్చ | Varma Sunny Leone tweet on Women'day.

Rgv controversial special tweet on womens day

RGV Sunny Leone, Ram Gopal Varma Women's Day Tweet, Ram Gopal Varma Sunny Leone, Sunny Leoene Women's Day, Sunny Leone Controversy, RGV Controversy

Director Ram Gopal Varma controversial tweet on World Women's Day. RGV specified Sunny Leone Name in that.

రాంగోపాల్ వర్మ ఉమెన్స్ డే ట్వీట్ పై సీరియస్

Posted: 03/08/2017 11:45 AM IST
Rgv controversial special tweet on womens day

దర్శకుడు రాంగోపాల్ వర్మ మైండ్ లో ఉన్నంత వంకర ఆలోచనలు ఇంకెవరికీ రావేమో. దగ్గరి సెలబ్రిటీలను సైతం వదలకుండా అతగాడు చేసే కామెంట్లు ఒక్కోసారి తెగ సీరియస్ అవుతుంటాయి. రాజకీయాలు, సినిమాలు, ఇలా ఏ టాపిక్ ను కూడా వర్మ వదలడు. అలాంటి జీనియస్ మహిళా దినోత్సవం రోజున చేసిన ఓ ట్వీట్, అది కూడా ఓ మాజీ పోర్న్ స్టార్ ను ఉద్దేశించి చేయటం తీవ్ర కలకలం రేపుతోంది.

బాలీవుడ్ నటి సన్నీలియాన్ పేరును ప్రస్తావిస్తూ... సన్నీ ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో, ప్రపంచంలో ఉన్న మహిళలంతా అంతే సంతోషాన్ని కలిగించాలని డబుల్ మీనింగ్ డైలాగ్ తో ట్వీట్ చేశాడు. అంతే ఈ ఉదయం ఆ ట్వీట్ అలా పడిందో లేదో.. ఇలా వర్మ ట్విట్టర్ లో బూతులు పడుతున్నాయి.

ఆడవాళ్ల కోసం మగవాళ్లు ఏం చేస్తారో తనకు తెలియదని, కానీ సంవత్సరంలో ఒకరోజు మాత్రం మహిళాదినోత్సవం పేరిట సంబరాలు చేస్తారని అంతకుముందు పెట్టిన ట్వీట్ లో వ్యాఖ్యానించాడు. పురుషులందరి తరఫునా మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ఏదో ఒకరోజు పురుషులకూ స్వాతంత్ర్యం లభిస్తుందని, 'మెన్స్ డే' జరుపుకునే రోజు వస్తుందంటూ తనదైలి శైలిలో ట్వీటాడు కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Ram Gopal Varma  World Women's Day Tweet  Sunny Leone  

Other Articles